విజయవాడ : కాంగ్రెస్ అధిష్ఠానం అస్తవ్యస్త నిర్ణయాలతోనే ఆ పార్టీకి రాజీనామా
చేసి బయటకు వచ్చినట్లు బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి చెప్పారు.
పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తానని చెప్పినా వదులుకున్నట్లు వివరించారు. ప్రజలకు
మేలు చేయవచ్చనే నమ్మకంతోనే బీజేపీలో చేరానన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు
ఏ ప్రాంతం నుంచైనా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.తొలిసారిగా విజయవాడ వచ్చిన సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి బీజేపీ నేతలు, కార్యకర్తలు గన్నవరం
విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,
ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి
పురేందేశ్వరి, కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్
దేవదర్ తదితరులు కిరణ్‌కుమార్‌రెడ్డికి సాదర ఆహ్వానం పలికారు.