విజయవాడ : ఏపిజెఏసి రాష్ట్ర కమిటి ఇచ్చిన మలిదశ ఉధ్యమకార్యచరణలో బాగంగా
మంగళవారం ఒక్కరోజు ప్రభుత్వ ఉద్యోగులు అంతా సెల్ పోన్ వినియోగించకుండా వారిలో
ఉన్న ఆవేదను, నిరశను ప్రభుత్వానికి తెలిపారు. సెల్ డౌన్ కార్యక్రమాన్ని
విజయవంతం చేయడం పట్ల ఉద్యోగులందరికి రాష్ట్ర కమిటీ నుంచిఏపిజెఏసి అమరావతి
చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పలిశెట్టి దామోదర రావు అభినందనలు తెలిపారు.
అలాగే ఈ ఉద్యమ కార్యాచరణలో బాగంగా ఈనెల 12 న బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్
కార్యాలయాల వద్ధ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
కార్యక్రమాలు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 26 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల దగ్గర
ధర్నా లు నిర్వహిస్తున్నామని, ఈ ధర్నా లో ఉద్యోగ, ఉపాధ్యయ, కార్మిక,రిటైర్డు,
ఔట్ సోర్శింగు ఉధ్యోగులంతా పాల్గొని విజయవంతం చేయాలని మంగళవారం ఒక ప్రకటన
ద్వారా ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ
జెనరల్ పలిశెట్టి దామోదరరావు ఉద్యోగులకు పిలుపు నిస్తూ విజ్ఞప్తి చేసారు.
ధర్నాల విజయవంతానికి 7 రాష్ట్ర టీమ్ లు:
రాష్ట్ర వ్యాప్తంగా (26 జిల్లాల్లో) బుధవారం నుంచి ప్రారంభమయ్యే ధర్నా
కార్యక్రమాలు విజయవంతం చేయడానికి, ఉద్యోగుల్లో ఉద్యమ స్పూర్తి పెంచేందుకు
రాష్ట్ర కమిటీ లోని ముఖ్య నాయకులు 7 టీములుగా ఏర్పడి నాలుగు జోన్లు కవర్
అయ్యేటట్లు పర్యటనలు చేస్తారు. అందులో భాగంగా బొప్పరాజు అనకాపల్లి, విజయనగరం
జిల్లాలలో పాల్గొంటుoడగా, సెక్రెటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ కడపలో
పాల్గొంటారు, మిగిలిన 5 టీం లు నాయకులు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు
వెళ్తారని చెప్పారు.