విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో ఎంప్యానల్మెంట్ కలిగిన చిన్న పత్రికలకు తగిన
గుర్తింపు ఇవ్వాలని మంగళవారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ
కుమార్ రెడ్డి ని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతల నుండి విచ్చేసిన చిన్న
పత్రికల ఎడిటర్స్ కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఇటివల విడుదల చేసిన
జి.వో 38. చిన్న పత్రికలకు ఏమాత్రం ఆశాజనకంగా లేదని కమిషనర్ దృష్టికి
తీసుకువచ్చారు. ప్రచురణ కలిగిన జిల్లాలో అన్ని నియోజవర్గాల్లోనూ ఎంపనెల్మెంట్
కలిగిన చిన్న పత్రికలకు ఒక్కొర్ జర్నలిస్ట్ అక్రిడేషన్ ఇవ్వాలని, అలాగే ఇతర
జిల్లాలలో కూడా ఒక్కో అక్రిడేషన్ మంజూరు చేయాలని అధికారులను కోరారు. విజయవాడతో
పాటు గుంటూరు నుండి ప్రచురితమవుతున్న పత్రికలకు కమిషనర్ కార్యాలయంలో
అక్రిడేషన్ మంజూరు చేయాలని కోరారు. ఎంప్యానల్మెంట్ కలిగిన పత్రికలకు ఇతర
రాష్ట్ర ల మాదిరిగా ప్రతి నెలా క్రమం తప్పకుండా ప్రకటనలు మంజూరు చేయాలని
కోరారు. గత నాలుగేళ్లుగా ఒక్క ప్రకటన ఇవ్వక పోయినా, తాము పత్రికలను క్రమం
తప్పకుండా తీసుకుని వస్తున్నామని కమిషనర్ కు, జాయింట్ డైరెక్టర్ కిరణ్ కుమార్
కు వారు విన్నవించారు. ఏప్రిల్ 14 బాబా సాహెబ్. డాక్టర్ బి.అర్. అంబేడ్కర్
జయంతి సంద్భంగా చిన్న పత్రికలకు ప్రకటన మంజూరు చేయాలని చిన్న పత్రికల ఎడిటర్స్
మల్లెల వార్త, అంతిమ తీర్పు సంపాదకులు వల్లూరు ప్రసాద్ కుమార్, మల్లెల
శ్రీనివాస రావు, అనంత భూమి సంపాదకులు అనిల్ కుమార్ రెడ్డి, కామన్ మ్యాన్
వాయిస్ సంపాదకులు ఎన్. కోటేశ్వర రావు, అమరావతి అపురూప సంపాదకులు మారుతీ చౌదరి,
పున్నమి సంపాదకులు కోటేశ్వరరావు, ఉత్తేజిత సంపాదకులు, స్వాతి ముత్యం
సంపాదకులతో పాటు పలువురు ఎడిటర్లు, జర్నలిస్టులు పాల్గొన్నారు.