గుంటూరు : స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని
స్థాపించి పార్టీ విధి విధానాలకు రూపకల్పన చేశారని టీడీపీ అధ్యక్షుడు
అచ్చెన్నాయుడు అన్నారు. జ్యోతిరావు పూలే, అంబేద్కర్, జగ్జీవన్ రామ్ లు తెచ్చిన
సంస్కరణలనే ఎన్టీరామారావు పునరుద్ధరించారన్నారు. తెలుగు దేశం పార్టీ మహిళలకు
ఆస్తిలో సమాన హక్కు కల్పించిందని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఆనాడు
ఎన్టీరామారావు మహిళలకు పెద్దపీట వేశారని, నేడు చంద్రబాబునాయుడు మహిళలకు
డ్వాక్రా సంఘాలు, అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటుచేసి ప్రోత్సహిస్తూ
వస్తున్నారన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ
ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలను ఘనంగా
నిర్వహించారు.ఈ సందర్భంగా దేశంలో మహిళల విద్య కోసం, సమాన హక్కుల కోసం పోరాడిన మహనీయులు పూలే
అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ అనేక సంవత్సరాలుగా పూలే విధి విధానాలను
వీడకుండా కొనసాగిస్తూ వస్తోందన్నారు. నాటికి, నేటికి, ఏనాటికి పూలే ఆశయ సాధన
కోసం అందరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు
కింజారపు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, పార్టీ
జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్,మాజీ మంత్రులు పీతల సుజాత, జవహర్,
ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ , గుంటుపల్లి నాగేశ్వర రావు,
వీరంకి గురుమూర్తి,గంజాం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.