లండన్ లో చదువుకుంటున్న జగన్ కుమార్తె
కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్తున్న సీఎం జగన్ దంపతులు
ఈ నెల 21న బయల్దేరే అవకాశం
గుంటూరు : ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి లండన్ వెళ్తున్నారు. తన భార్య భారతితో
కలిసి ఆయన లండన్ పర్యటనకు వెళ్లబోతున్నారు. జగన్ కుమార్తె లండన్ లో
చదువుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా జగన్ దంపతులు తన కుమార్తె వద్దకు
లండన్ కు వెళ్తుంటారు. ఈ నెల 21న జగన్ దంపతులు లండన్ కు బయల్దేరే అవకాశం ఉంది.
వారం రోజుల పాటు వీరు లండన్ లో గడపనున్నారు. ఈ పర్యటన పూర్తిగా
వ్యక్తిగతమైనది. గత ఏడాది జగన్ కూతురు డిగ్రీ పట్టా పొందారు. ఆ సందర్భంగా
జగన్, భారతి లండన్ కు వెళ్లారు. 2019 నుంచి ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలల్లో
జగన్ లండన్ వెళ్లడం ఆనవాయతీగా మారింది.