విజయవాడ : భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో స్టార్టప్స్ కీలకపాత్ర
పోషిస్తున్నాయని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం ఈ అంశంపై తన
అభిప్రాయం వెల్లడించారు. నేషనల్ స్టార్టప్ అవార్డు 2023 కు అర్హులమని
భావిస్తున్న ఇన్నోవేటర్లు (ఆవిష్కర్తలు) తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని
కోరారు. ఎంటర్ ప్రెన్యూరర్లు, ఇన్నోవేటర్లు భారతదేశ ఆర్థికాభివృద్ధిలో కీలకంగా
ఉన్నారని అయన అన్నారు. అవార్డులు యువ పారిశ్రామిక వేత్తలు, కొత్త పారిశ్రామిక
వేత్తలకు స్పూర్తినిస్తాయని ఆయన అన్నారు.