గుడివాడ : ఆరోగ్యవంత గుడివాడ రూపకల్పనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని,
ఎమ్మెల్యే కొడాలి నాని ను అనుసరిస్తూ నమ్మి గెలిపించిన ప్రజల రుణం
తీర్చుకునేలా పనిచేస్తానని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాల సౌరి
అన్నారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో 70 లక్షల నిధులతో నూతనంగా
నిర్మించిన 10 పడకల వృద్ధుల విభాగం, ఏరియా హాస్పిటల్ ల్లో 35 లక్షల నిధులతో
ఏర్పాటు చేసిన అత్యాధునిక మోడల్ లిఫ్ట్ ను ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి
ఎంపీ వల్లభనేని బాలసౌరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బాలసౌరి
మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యరంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
చేస్తున్న కృషికి తోడు వైద్యసేవల మెరుగుకు తన వంతు కృషి చేస్తున్నారని, ఈ
ప్రక్రియలో భాగంగా పవర్ ఫైనాన్స్ సంస్థ ఎండి బిలాల్ ను సంప్రదించగా,
సానుకూలంగా స్పందించిన ఆయన, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో వైద్య సేవల
మెరుగుకు10 కోట్లు సిఎస్సార్ నిధులు ప్రకటించారని, ఇప్పటికే ఐదు కోట్లు
విడుదలైనట్లు ఎంపీ బాలసౌరి చెప్పారు. సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ వైద్యశాలలో
అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన
తెలిపారు. ప్రధానంగా రెండున్నర కోట్ల సిఎస్సార్ నిధులతో క్యాన్సర్ పరీక్షలకు
అల్ట్రా స్కానింగ్, రేడియాలజిస్టులతో కూడిన అత్యాధునిక హైటెక్ బస్సు
అందుబాటులోకి రానుందన్నారు. రెండు నెలల్లో అందుబాటులోకి రానున్న క్యాన్సర్
బస్సు ద్వారా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని గ్రామ గ్రామాన అత్యాధునిక వైద్య
పరికరాలతో ఉచితంగా క్యాన్సర్ చికిత్సలను ఉచితంగా అందచేస్తామన్నారు. పార్లమెంట్
నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు మేలు చేసేందుకు నిధులు ఎలా తేవాలో, ఎక్కడ నుండి
తేవాలో తనకు బాగా తెలుసని, ప్రజలకు మంచి చేయడమే తమ లక్ష్యమని ఎంపీ బాలసౌరి
అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్
ఎంవి నారాయణరెడ్డి, హాస్పటల్ సూపరిండెంటేట్ ఇందిరా దేవి, పట్టణ వైసిపి
అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా యువజన భాగ అధ్యక్షుడు మెరుగు మాల కాళీ,
ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ పాలేటి చంటి, గుడివాడ జడ్పిటిసి గొళ్ళ
రామకృష్ణ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యులు వైఎస్ఆర్సిపి నాయకులు
పాల్గొన్నారు.