చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత
ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో బదిలీల పర్వం సాగుతోంది. నిన్న 54 మంది ఐఏఎస్‌లను ట్రాన్స్ఫర్ చేసిన
ప్రభుత్వం నేడు ఐపీఎస్‌లను బదిలీ చేసింది. 39 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ
చేస్తూ.. సీఎస్ జవహర్‌రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీ
చేశారు. ఏసీబీ అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్న జీవీజీ అశోక్‌కుమార్‌ను ఏలూరు
డీఐజీగా బదిలీ చేశారు. ఏలూరు డీఐజీగా పనిచేస్తున్న జి.పాలరాజును గుంటూరు ఐజీ,
దిశ ఐజీగా బదిలీ చేశారు. శాంతిభద్రతల ఏఐజీగా పనిచేస్తున్న
ఆర్.ఎన్.అమ్మిరెడ్డిని అనంతపురం డీఐజీగా పంపారు. అనంతపురం డీఐజీగా
పనిచేస్తున్న ఎం.రవిప్రకాశ్‌ను సెబ్ డీఐజీగా స్థానచలనం కల్పించారు. దిశ డీఐజీ
బి.రాజకుమారిని ఏపీఎస్పీ బెటాలియన్స్ డీఐజీగా నియమించారు.ఏపీఎస్పీ విశాఖ బెటాలియన్ కమాండెంట్‌గా పనిచేస్తున్న కోయ ప్రవీణ్‌ను గ్రే
హౌండ్స్ డీఐజీగా బదిలీ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా విధులు
నిర్వహిస్తున్న శంఖబత్ర బాగ్చీని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా
ట్రాన్స్ఫర్ చేశారు. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ను
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేశారు. ప్రొవిజన్స్ అండ్
లాజిస్టిక్స్ అదనపు డీజీపీగా పనిచేస్తున్న అతుల్‌సింగ్‌ను పోలీసు నియామక మండలి
ఛైర్మన్, అదనపు డీజీపీ, ఏపీఎస్పీ బెటాలియన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
పోలీసు నియామక మండలి ఛైర్మన్‌గా ఉన్న మనీష్‌కుమార్ సిన్హా ప్రస్తుతం సెలవులపై
వెళ్లగా ఆయన స్థానంలో అతుల్‌సింగ్‌ను బదిలీ చేశారు. విశాఖపట్నం కమిషనర్‌గా విధులు
నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీకాంత్‌ను సీఐడీ ఐజీగా బదిలీ చేశారు. గుంటూరు ఐజీగా
పనిచేస్తున్న సీఎం త్రివిక్రమ వర్మను విశాఖపట్నం కమిషనర్‌గా ట్రాన్స్ఫర్
చేశారు. విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్న విక్రాంత్ పాటిల్‌ను
పార్వతీపురం మన్యం ఎస్పీగా బదిలీ చేశారు.
పార్వతీపురం మన్యం ఎస్పీ వాసన్ విద్యాసాగర్ నాయుడును విశాఖపట్నం శాంతిభద్రతల
డీసీపీగా బదిలీ చేశారు. విశాఖపట్నం శాంతిభద్రతలు డీసీపీగా ఉన్న గరుడ్ సుమిత్
సునీల్‌ను ఎస్బీఐ ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేశారు. పాడేరు అదనపు ఎస్పీగా ఉన్న
తుహిన్ సిన్హాను అల్లూరి సీతారామరాజు ఎస్పీగా బదిలీ చేశారు. అల్లూరి
సీతారామరాజు ఎస్పీగా ఉన్న ఎస్. సతీష్‌కుమార్‌ను కాకినాడ ఎస్పీగా ట్రాన్స్ఫర్
చేశారు. కాకినాడ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబును పోలీసు ప్రధాన కార్యాలయంలో
రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అనకాపల్లి ఎస్పీగా ఉన్న గౌతమి
శాలిను విశాఖపట్నం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ చేశారు. డా.అంబేడ్క్
కోనసీమ ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్ రెడ్డిని తూర్పుగోదావరి ఎస్పీగా పంపించారు.
విజయవాడ శాంతిభద్రతలు, డీసీపీ డి.మేరి ప్రశాంతిని ఏలూరు ఎస్పీగా బదిలీ చేశారు.
ఏలూరు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా
స్థానచలనం కల్పించారు.
నెల్లూరు ఎస్పీగా ఉన్న సీహెచ్ విజయరావును కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్
కమాండెంట్‌గా బదిలీ చేశారు. ఏసీబీ ఎస్పీ ఆర్.గంగాధర్‌రావును అన్నమయ్య జిల్లా
ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజును సీఐడీ
ఎస్పీగా బదిలీ చేశారు. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పను సీఐడీ ఎస్పీగా బదిలీ
చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్‌ను విజయవాడ, రైల్వే ఎస్పీగా
ట్రాన్స్ఫర్ చేశారు. కర్నూలు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను ఆక్టోపస్ ఎస్పీగా
ప్రభుత్వం బదిలీ చేసింది.మరోవైపు పోస్టింగ్‌ల కోసం నిరీక్షిస్తున్న ఆరుగురు
ఐపీఎస్‌లను కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.వి.
మాధవ్రెడ్డిని సత్యసాయి జిల్లా ఎస్పీగా, కె.శ్రీనివాసరావును అనంతపురం ఎస్పీగా,
తిరుమలేశ్వర్‌రెడ్డిని నెల్లూరు ఎస్పీగా, పి.శ్రీధర్‌ను డా.అంబేడ్కర్ కోనసీమ
ఎస్పీగా,కె.వి.మురళీకృష్ణను అనకాపల్లి ఎస్పీగా, సర్వశేష్ఠ్ర త్రిపారిని
పరిపాలన, పోలీసు ప్రధాన కార్యాలయం డీఐజీగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ
చేశారు.