విజయవాడ : స్థాయిని మరిచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని
విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని మాజీ కాంగ్రెస్ నేత నూతలపాటి రవికాంత్ అన్నారు.
స్థాయి లేని, అనామక కాంగ్రెస్ పార్టీ నేతలు కిరణ్ కుమార్ రెడ్డి ని
విమర్శిస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. పట్టుమని పదిమంది కూడా లేని కాంగ్రెస్
నేతలు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని సూచించారు. దేశంలో..రాష్ట్రంలో ఇక
కాంగ్రెస్ పార్టీ కనుమరుగేనని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కిరణ్
కుమార్ రెడ్డి 50 సంవత్సరాల సుదీర్ఘకాలం పనిచేసి కాంగ్రెస్ విధానాలు నచ్చక
పార్టీ మారితే.. పనికిమాలిన వారు, అర్హతలేని వారు, సమాజంలో ఎందుకూ పనికి
రానివారు విమర్శిస్తే తగు రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన
శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తప్పుడు నిర్ణయాల వల్లే కాంగ్రెస్ అధికారం కోల్పోతోందని, ఇక భవిష్యత్‌లో దేశంలో
ఎక్కడా కూడా అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. నాయకత్వ లేమితో కాంగ్రెస్
పార్టీ ఇబ్బందులు పడుతోందని, దేశంలో ఏ రాష్ట్రం లో కూడా సత్తా కలిగిన నాయకులు
కాంగ్రెస్ లో లేరని, ఇక ఆంధ్ర ప్రదేశ్ లో వున్నా నలుగురు కూడా స్పందిస్తుంటే
హాస్యాస్పదంగా ఉందని రవికాంత్ అన్నారు. దేశ వ్యాప్తంగా వరస ఓటములు
చవిచూస్తున్నా, ఆ ఓటమి నుంచి కూడా ఇంకా కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకోవడంలేదని
విమర్శించారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు కేవలం రిమోట్ కంట్రోల్ అధికారం మాత్రమే
కావాలని, కానీ దేశాన్ని వృద్ధి చేయాలన్న సంకల్పంతో బీజేపీ ప్రభుత్వం
పనిచేస్తోందని, దేశ శ్రేయస్సు కోసం బిజెపి పార్టీ అహర్నిశలు శ్రమిస్తోందని,
ప్రధానమంత్రి మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా
ల ఆధ్వర్యంలో భారత దేశం మునుపెన్నడూ లేనంత అభివృద్ధితో అడుగులు వేస్తోందని
రవికాంత్ అన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాలన్నది బీజేపీ లక్ష్యమని, దేశాన్ని
సర్వనాశనం చేయాలన్నది కాంగ్రెస్ లక్ష్యమని రవికాంత్ అన్నారు. కేంద్రంలో 2024లో
నరేంద్ర మోడీ, అమిత్‌షా, నడ్డా డైరెక్షన్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని,
రాష్ట్రంలో సోము వీర్రాజు, మధుకర్ ల ఆధ్వర్యంలో బిజెపి ప్రభుత్వం
ఏర్పాటుకానున్నదని రవికాంత్ పేర్కొన్నారు.