విజయవాడ : స్థానిక భవానిపురం గల ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
కార్యాలయం నందు శుక్రవారంమా నమ్మకం నువ్వే జగనన్న
కార్యక్రమాన్నిప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ
శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. 7లక్షల
మంది జగనన్న సైన్యంతో ప్రజల ముందుకు నేటి నుండి వెల్లబోతున్నామన్నారు.
ప్రజాభిప్రాయాలు సేకరించబోతున్నామన్నారు. కుల, ప్రాంత, వర్ణ, పార్టీ అనే
తారతమ్యాలు లేకుండా ప్రతి ఇంటికి వెళ్తామన్నారు. సుమారు కోటి 60 లక్షల ఇళ్ళా
వద్దకు వెళ్లబోతున్నామన్నారు. జగనన్న వచ్చాక ఈ నాలుగేళ్లలో చేసిన సంక్షేమం,
అభివృద్ది ఎలా ఉండనే అభిప్రాయాన్ని ప్రజల వద్ద నుండి తెలుసుకునే ప్రయత్నం
చేయబోతున్నామన్నారు.
గత టీడీపీ, నేటి జగనన్న ప్రభుత్వాల మధ్య తేడాను ప్రజలకు చెబుతామని, గతంలో
చంద్రబాబు విజయవాడ నగర అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. ప్రభుత్వం చేసిన మంచి
ఎలా ఉందని ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల నోట తెలుసుకునే విషయంలో దేశంలోనే మొట్ట
మొదటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని చెప్పటానికి గర్వంగా వుందన్నారు.ఈ
ప్రజా అభిప్రాయ సేకరణ అయ్యాక ఈ నెల 25న ప్రజల ముందర రాష్ట్ర వ్యాప్తంగా
ప్రజాభిప్రాయాలను ఎటువంటి తారతమ్యం లేకుండా బహిరంగంగా తెలియచేస్తామని
తెలిపారు. మాది ప్రజా ప్రభుత్వం..మా వద్ద దాపరికాలు వుండవన్నారు. మేము ఏమి
చేసినా ప్రజలకే మంచి చేస్తాం అని తెలిపారు. ప్రజల వద్దకు ప్రభుత్వం పరిపాలన
అందిస్తున్నామన్నారు. దేవుళ్ళను హిందువులను అవమానించే వ్యక్తులు
చంద్రబాబు,అచ్చంనాయుడు అని అన్నారు. గతంలో బూట్లు వేసుకొని దైవ పూజలు చేసిన
వ్యక్తులని, అదే రామోజీ దగ్గరకు వెళ్తే బూట్లు తీసి వెళ్తారని అన్నారు.
చంద్రబాబు కి రామోజీ దేవుడు కానీ రాముడు దేవుడు కాదన్నారు. గతంలో అనేక
దేవాలయాలను కూల్చిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. వాటిని పునర్
నిర్మిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, వివిధ
కార్పొరేషన్ల చైర్మన్లు బండి పుణ్యశిల, తోలేటి శ్రీకాంత్, మనోజ్ కొఠారి, గౌస్
మొహిద్దీన్, దుర్గ గుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, సీనియర్ నాయకులు ఆకుల
శ్రీనివాసరావు, జిఎంసి బాషా, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, వివిధ డివిజన్ల
కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు
పాల్గొన్నారు.