రాజమండ్రి : ఏపీ హక్కుల కోసం ఎప్పుడూ పోరాటం చేస్తున్నామని, విభజన హామీలు అమలు
చేయటంలో రాజకీయ పార్టీలు భయపడుతున్నాయని ప్రత్యేకహోదా విభజన హామీల సాధన సమితి
కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఎప్పుడూ పోరాటం
చేస్తున్నామని, విభజన హామీలు అమలు చేయటంలో రాజకీయ పార్టీలు భయపడుతున్నాయని
ప్రత్యేకహోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు.
శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన
అద్యాయమనేవారు ఆంద్రా ద్రోహులని అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని పోలవరం
నిర్వాసితులతో కలిశామని, కేంద్ర ప్రభుత్వం ఏపీని బ్లాక్ మొయిల్ చేస్తోందని,
నిర్వాసితులకు ఏలా న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్రం పోలవరం
ప్రాజెక్టు విషయంలో మోసం చేస్తోందన్నారు.