డోన్ : డోన్ పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న ఆర్ అండ్ బీ అతిథి గృహాన్ని
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆకస్మింగా పరిశీలించారు. వాకింగ్
ట్రాక్, ల్యాండ్ స్కేప్ పనులకు సంబంధించి పలు సూచనలిచ్చారు.నాణ్యతలో
రాజీపడకుండా వేగంగా నిర్మించి పూర్తి చేయాలని స్థానిక ఇంజనీరింగ్ అధికారులను
మంత్రి బుగ్గన ఆదేశించారు. బుధవారం సాయంత్రం డోన్ లో నిర్మిస్తున్న కొత్త
గెస్ట్ హౌస్ తో పాటు, పాత భవన ఆధునీకరణ పనులను ఆయన పర్యవేక్షించారు. వంటశాల,
శౌచాలయాలకు సంబంధించి పనుల్లోనూ కొన్ని మార్పులు చేయాలన్నారు. డోన్ లో
నిర్మిస్తున్న ఈ కొత్త అతిథి గృహ నిర్మానానికి ప్రభుత్వం రూ.4.80 కోట్లు
ఖర్చు చేస్తుందన్నారు. పాత గెస్ట్ హౌస్ ఆధునీకరణకు మరో రూ.20 లక్షలు
ఖర్చుపెడుతున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.