అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర
ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనిస్తూ సంక్షేమాభివృధ్ధికి కృషి చేస్తున్నట్లు
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. వైఎస్ఆర్ ఆసరా, జగనన్న
అమ్మఒడి, గృహాలకు సంబంధించిన పట్టాలు, చేయూత వంటి సంక్షేమ పథకాలతో మహిళలనే
లబ్ధిదారులను చేస్తూ ప్రతి కుటుంబం అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం పాటు
పడుతుందన్నారు. గత ప్రభుత్వం లాగా నెలకు ముందు పసుపు-కుంకుమ కార్యక్రమాలతో
మాయాజాలం చేయకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కోవిడ్ వంటి
విపత్తులు వచ్చినా ఆపకుండా, వెరవకుండా సంక్షేమాన్ని ప్రజల ముంగిటకు చేరువ
చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నాలుగు విడతలలో 8 లక్షల డ్వాక్రా సంఘాలలోని
80 లక్షల మందికి పైగా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా కింద రూ.25వేల కోట్లు ఆడపడచుల
పక్షాన వడ్డీ మాఫీ చేయాల్సి ఉండగా ఇప్పటికే 3 విడతలలో రూ.19వేల కోట్లు మాఫీ
చేశామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఒక్క డోన్ మండలంలోనే
(పట్టణం, గ్రామీణం కలిపి) వైఎస్ఆర్ ఆసరా కింద 14,500 డ్వాక్రా సంఘాల మహిళలకు
ఇప్పటికే రూ.27 కోట్ల 50 లక్షలు మాఫీ చేశామన్నారు. నాలుగో విడత కూడా పూర్తయితే
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో డ్వాక్రా మహిళకు ఇంచుమించు రూ.25వేల లబ్ధి
చేకూర్చినట్లేనని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా
‘వైఎస్ఆర్ చేయూత’ కింద 12,260 మందికి రూ.66 కోట్లు, ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ’
కింద 4500 డ్వాక్రా గ్రూపులకు రూ.18 కోట్ల 50 లక్షలు మహిళల కోసం సింహభాగం
ఖర్చు చేసిన ప్రభుత్వం ఇదేనని మంత్రి తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా మూడవ విడత కింద
డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా గల 3,803 డ్వాక్రా సంఘాలలోని 36,978 మంది మహిళా
సభ్యులకు రూ.22 కోట్లు వడ్డీ మాఫీ చేశామన్నారు. దీంతో మూడు విడతలు కలిపి రూ.67
కోట్లు డోన్ లోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
‘ఆసరా’ అందించిందని మంత్రి బుగ్గన తెలిపారు. శ్రీ ఫంక్షణ్ హాల్ లో పొదుపు
మహిళలకు వైఎస్ఆర్ ఆసరా చెక్కులను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పంపిణీ
చేశారు. అంతకు ముందు బుధవారం ఉదయం నెహ్రూనగర్ లోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి
బుగ్గన రాజేంద్రనాథ్ స్వగృహం ఎదుట రూ.30 లక్షలతో ఏర్పాటైన మున్సిపల్ పార్కును
ఆయన చేతులమీదుగా ప్రారంభించారు. అనంతరం మండలంలోని వెంకటాపురం చెరువు వద్ద
రూ.3కోట్లతో చేపట్టనున్న బోటిం