విజయవాడ : గత ఏప్రిల్ నెలలో గుండెపోటుతో మరణించడంతో వారి భార్య అయినవిల్లి
నాగ ఇందిర కు మంగళవారం కలెక్టర్ చాంబర్లో కారుణ్య నియామకల కింద జూనియర్
అసిస్టెంట్ గా జిల్లాకలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా రాష్ట్రగ్రామ
రెవిన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు
ఆధ్వర్యంలో మంగళవారం నియామక ఉత్తర్వులు అందించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి
జిల్లా ఏలూరు జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ కారుణ్య నియామకాలు జీవో
658 ప్రకారం పెదవేగి మండలంలో అయినవల్లి శ్రీనివాస్ భార్యకు అందించారు.
ఆంధ్రప్రదేశ్ విఆర్ఓ అసోసియేషన్ రాష్ట్ర రాష్ట్ర కార్యాలయం నుండి రాష్ట్ర
గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్ర రాజు ఈ మేరకు ఒక
ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జోషి, ఏలూరు జిల్లా
నూతనముగా ఏర్పడిన గ్రామ రెవెన్యూ అధికారుల జిల్లా సంఘము జిల్లాఅధ్యక్షులు ఆర్
సి రామచంద్రమూర్తి, ప్రధాన కార్యదర్శి సిరిగినీడి సుబ్బారావు, అసోసియేట్
అధ్యక్షులు. ఎస్ కె.అక్బర్, కోశాధికారి డి. రవికుమార్, జిల్లా నాయకులు, కేడీకే
ప్రసాద్, ఝాన్సీ రాణి, డి. వీరభద్రరావు, ఏలూరు డివిజన్ అధ్యక్షులు,
వెంకటేశ్వరరావు గారు, కార్యదర్శి ప్రభాకర్, సింహాచలం పాల్గొన్నారు.
అలాగే నూతన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను మర్యాదపూర్వకంగా
కలిశారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర రాజు మాట్లాడుతూ కారుణ్య
నియామకల జీవో 658 తో రాష్ట్రంలోఏలూరు జిల్లాలో మొట్టమొదటి గా జూనియర్
అసిస్టెంట్ గా అయినవల్లి ఇందిరకు కారుణ్య నియామకాలు ఉత్తర్వులు ఇవ్వడం
జరిగిందని, మా గ్రామ రెవెన్యూ అధికారులకు గతంలో ఎప్పుడు లేనివిధంగా చనిపోయిన
వీఆర్వో కుటుంబానికి న్యాయం జరుగుతున్నందున , ప్రభుత్వం 658 జీవో ఇవ్వడం పట్ల
హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర
రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.
సాయిప్రసాద్ , రిటైర్డ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉషారాణి ,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి
రాజు రవీంద్ర రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలనాయుడు కృతజ్ఞతలు
తెలిపారు.