విజయవాడ : బదిలీల పై మరో రెండు వారాలలోగా స్పష్టత వస్తుందని ఆంధ్రప్రదేశ్
గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా
అన్నారు. గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ తో
రెండు గంటలపాటు సుధీర్ఘ చర్చలు అనంతరం వినతి పత్రాన్ని సమర్పించారు. సచివాలయ
ఉద్యోగులకు నేషనల్ ఇంక్రిమెంట్లు కల్పించే అంశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ
సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయ
ఉద్యోగులకు బదిలీలు కల్పించాలని, రెండో బ్యాచ్ లో రిక్రూట్మెంట్ ఐన ఉద్యోగుల
ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరుతూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ను కలిసి
సుమారుగా రెండు గంటలపాటు సుధీర్ఘ చర్చలు జరిపి వినతిపత్రం సమర్పించారు.
ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ పై రెండు అంశాలపై స్పష్టతనిస్తూ రాబోయే
రెండు వారాలలో ఏప్రియల్ 15వ తేదీ లోగా బదిలీల పై స్పష్టత ఇస్తామని,
తప్పనిసరిగా బదిలీలు కల్పిస్తామని, రెండో దశలో 2020వ సంవత్సరంలో రిక్రూట్మెంట్
ఐన 15వేల మంది సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ కూడా మరికొన్ని రోజుల్లో ఏప్రియల్
మాసంలోనే డిక్లేర్ చేస్తామని స్పష్టతనిచ్చారు. అలాగే టార్గెట్ బేస్ సిస్టం
రద్దు చేసి రోజువారీ సర్వీసులు తప్పనిసరిగా చేయాలనే నిబంధన సడలించి వార్డు
విద్యా కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లకు వత్తిడి తగ్గించాలని కోరడమైనది.
అలాగే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు మరియు గ్రేడ్-2 వి.ఆర్.ఒల ప్రొబేషన్
డిక్లరేషన్ కు అవసరమైన సి.పి.టి పాస్ అవ్వని వారు సుమారు 500మంది వున్నారని
వారికోసం మరోసారి పరీక్ష నిర్వహించేలా ఎపిపియస్సి తో మాట్లాడి నోటిఫికేషన్
విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు అవసరమైన
క్యాజువల్ లీవ్స్ మూడు రోజుల వరకు ఇచ్చే అధికారం గ్రామ సచివాలయాల్లో పంచాయతీ
కార్యదర్శులకు వార్డు సచివాలయాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు
అధికారాలు కల్పించాలని చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన స్పెషల్ చీఫ్
సెక్రటరీ వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎక్స్
సర్వీస్ మెన్ లకు పే ప్రొటెక్షన్ కల్పించాలని,నోష్నల్ ఇంక్రిమెంట్లు
కల్పించాలని గ్రామ సచివాలయ ఉద్యోగులకు అసిస్టెంట్ అనే పదం తొలగించి సెక్రటరీగా
మార్పు చేయాలని విజ్ఞప్తి చేయగా అన్నీ అంశాలపై చర్యలు తీసుకొని ఉద్యోగులకు
మేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక
కార్యదర్శి యస్.కె.సుభాని,నాయకులు రహీం, బి.శ్వేత, యల్.అర్చన, బి.నిరోషా,
మెహబూబ్ తదితరులు పాల్గొన్నారు.