గుంటూరు : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెలుగునాడు
అంగన్వాడీ-డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర వ్యాప్త సమావేశం జరిగింది.
తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట
సునీత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డ్వాక్రా మహిళలకు చంద్రబాబు అందించిన
ఆర్థిక చేయూత, జగన్ రెడ్డి డ్వాక్రాను నిర్వీర్యం చేస్తున్న తీరు, ఆసరా పేరుతో
చేస్తున్న మోసం వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆసరా కాదు
డ్వాక్రాకు టోకరా-డ్వాక్రా అభివృద్ధి చంద్రన్నతోనే పేరుతో బ్రోచర్ విడుదల
చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్
బాబు, హెచ్ ఆర్ డీ చైర్మన్ రామాంజనేయులు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి
గురజాల మాల్యాద్రి, టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, తెలుగు మహిళ రాష్ట్ర
జనరల్ సెక్రటరీ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ
సందర్భంగా టీడీ జనార్ధన్ మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే ఏపీలో జగన్ అరాచక పాలన
అంతం తప్పదన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు సంక్షేమానికి పెద్దపీట వేయగా జగన్
రెడ్డి సంక్షేమం మాటున ప్రజాధనం లూటీ చేస్తున్నాడని అన్నారు. జగన్ రెడ్డిది
మోసకారి సంక్షేమమని, జగన్ రెడ్డి లూటీపై క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యం
చేయాలని డ్వాక్రా మహిళలకు అశోక్ బాబు, గురజాల మాల్యాద్రి, రామాంజనేయులు
సూచించారు. మహిళా శక్తి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. టీడీపీ మహిళా
సైన్యం ఒక్క తాటిపై నడుస్తూ జగన్ రెడ్డి చేస్తున్న మోసాలను ప్రజల్లోకి బలంగా
తీసుకెళ్లాలన్నారు. రుణమాఫీ పేరుతో డ్వాక్రా సంఘాలకు జగన్ టోకరా వేశాడని,
మహిళా సంక్షేమానికి జగన్ ఏం చేశాడో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆచంట సునీత,
పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.