గుంటూరు : గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా సోమవారం ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. తాడేపల్లి
క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు
నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు హాజరయ్యారు. గడపగడపకూ మన
ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్, పార్టీ శ్రేణులతో
చర్చించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ ఫిబ్రవరి 13న గడపగడపకూ
కార్యక్రమం మీద రివ్యూ చేశాం. దాని తర్వాత కార్యక్రమానికి కాస్త గ్యాప్
వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గ్యాప్ వచ్చింది. మార్చి 16వరకూ
కోడ్ కొనసాగింది.గేర్ మార్చి రెట్టించిన స్పీడ్‌తో కార్యక్రమం చేయాలి. రాష్ట్ర చరిత్రే కాదు. దేశ చరిత్రలో
ఎప్పుడూ చూడని విధంగా నాలుగు సంవత్సరాలు గడవక ముందే రూ.2లక్షల కోట్ల పైచిలుకు
ఎలాంటి వివక్ష, లంచాలకు తావులేకుండా మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అక్కౌంట్లో
పడింది. అర్బన్ ప్రాంతంలో 84శాతం, రూరల్ ప్రాంతంలో 92 శాతం కుటుంబాలు,
యావరేజీన 87శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం. ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి
ఎప్పుడూ జరగలేదు. 87శాతం కుటుంబాలను గమనించినట్టైతే అర్హులుగా ఉన్నవారిని
చాలా పారదర్శకంగా గుర్తించి అమలు చేశాం. పేదవాడు మిస్‌కాకుండా వెరిఫికేషన్
చేసిన మరీ వారికి పథకాలు అందిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేల
లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న
కుటుంబాల్లో వారిని అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చాం. బీపీఎల్ నిర్వచనాన్ని
మారుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10వేలకు, అర్బన్ ప్రాంతాల్లో
రూ.12వేలకు పెంచి పథకాలు ఇచ్చాం. ఇలా చేస్తే 87శాతం ఇళ్లకు నేరుగా డీబీటీ
ద్వారా బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం.
21 స్థానాల్లో ఎన్నికలు గెలిస్తే 17 స్థానాల్లో మనం గెలిచాం. మనం మారీచులతో
యుద్ధంచేస్తున్నాం. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే
ప్రచారం చేస్తున్నారు. కొన్ని వాస్తవాలు అందరికీ తెలియాలి. ఒక్క ఎమ్మెల్సీ
స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో
కనీసం 2.5 లక్షల మంది ఉంటారు. అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి దాదాపు 80 లక్షల
ఓట్ల పరిధి ఉంటుంది. ఆ పరిధిలో 87శాతం అంటే అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన
కుటుంబాలు ఉన్నాయి. అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు
మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారు. వీళ్లంతా రకరకాల
యూనియన్లకు చెందినవారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లైన ఈ రెండున్నర లక్షల మంది
ఓటర్లలో దాదాపు చాలా శాతం మంది డీబీటీలో లేనివారు, కేవలం 20శాతం మంది మాత్రమే
డీబీటీలో ఉన్నవారు. ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్ అవుతుంది.