విజయవాడ: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం చైత్రమాస
బ్రహ్మోత్సవములలో భాగముగా రెండవ రోజు ఆదివారం సాయంత్రం మంగళ వాయిద్యములు,
కోలాటలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమముల నడుమ రావణ వాహనం పై శ్రీ గంగా
దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ఆలయ ట్రస్ట్
బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ,
ట్రస్ట్ బోర్డు సభ్యులు బుద్దా రాంబాబు, బచ్చు మాధవీ కృష్ణ, ఆలయ వైదిక, అర్చక
సిబ్బంది, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మల్లిఖార్జున మహామండపం నుండి
బయలుదేరి కనకదుర్గా నగర్, రధం సెంటర్, బ్రాహ్మణ వీధి, శ్రీనివాస మహల్, కోమలి
విలాస్ సెంటర్, సామరంగ చౌక్ , మెయిన్ రోడ్, రధం సెంటర్ మీదుగా తిరిగి మహామండపం
వద్దకు ఊరేగింపు చేరుకుంది. ఊరేగింపు నందు పాల్గొని భక్త జనులు విశేషముగా
తిలకించారు.