ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
విజయవాడ : పూర్తిస్థాయిలో ఉద్యమ కార్యాచరణ లో పాల్గొంటామని ఆంధ్రప్రదేశ్
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ(ఏపీ జేఏసీ అమరావతి అనుబంధం)
ప్రకటించింది. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణకు ఆంధ్ర ప్రదేశ్ గ్రామ
వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఆదివారం
గ్రామ, వార్డ్ సచివాలయం ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర స్థాయి కార్యవర్గ
సమావేశం విజయవాడ గవర్నర్ పేటలోని రెవెన్యూ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో
గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల సంక్షేమ సంస్థ 26 జిల్లాలకు గాను 21 జిల్లాల
అధ్యక్ష, కా ర్యదర్సులు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయాలు : ఏపీజేఏసీ అమరావతి
చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు నాయకత్వంలో గత మార్చి 9వ తేదీ నుండి
జరుగుతున్న ఉద్యమ కార్యాచరణకు ఆంధ్ర ప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల
సంక్షేమ సంస్థ పక్షాన సంపూర్ణ మద్దతు తెలుపుతూ సోమవారం నుంచి పూర్తి స్థాయిలో
ఉద్యమంలో రాష్ట్రవ్యాప్తంగా పాల్గొనాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆంధ్ర
ప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సంక్షేమ సంస్థ పక్షాన ఏపీ జేఏసీ
అమరావతి ఉద్యమ కార్యాచరణలో తప్పకుండా ప్రతిఒక్కరూ నల్ల బ్యాడ్జీలు ధరించి
విధులకు హాజరు కావాలని, వర్క్ తో రూల్ విధిగా పాటించాలని తీర్మానించారు.
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సంస్థాగతంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల
పరిష్కారం కోసం వివిధ దశలలో వినతి పత్రాలు అందచేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారం
కోసం కృషి చేస్తామని రాష్ట్ర కార్యవర్గం తెలిపింది.
ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ
జనరల్ పోలిశెట్టి దామోదర్, ట్రెజరర్ వీ.వీ మురళీకృష్ణ నాయుడు, సహద్యక్షులు
ఫణి పేర్రాజు, వైస్ చైర్మన్ చంద్ర శేఖర్, కార్యనిర్వహక కార్యదర్శి కృష్ణమోహన్,
సాంబశివరావు , గిరి కుమార్ రెడ్డి, ప్రచార కార్యదర్శి కిషోర్ , ఎన్ టీ ఆర్
జిల్లా చైర్మన్ డి. ఈశ్వర్, ఏపీజేఏసీ అమరావతి పక్షాన పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ పక్షాన రాష్ట్ర
ప్రెసిడెంట్ అర్లయ్య, జనరల్ సెక్రటరీ సీపాన గోవిందరావు, అసోసియేట్ ప్రెసిడెంట్
సాయినాథరెడ్డి, రాష్ట్ర కోశాధికారి బగ్గా జగదీష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ
సల్మాన్ బాషా, ఉపాధ్యక్షులు షామీర్ హుస్సేన్, జ్యోతి, హరి, జాయింట్ సెక్రెటరీ
కట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు.