కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గం లో 5 మందికి అంగన్వాడీ ఆయా నుండి ప్రమోషన్
పై అంగన్వాడీ కార్యకర్త గా నియమింపబడ డం శుభదాయకమని రాష్ట్ర హోమ్ మంత్రి డా.
తానేటి వనిత అన్నారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయం లో శుక్ర వారం
పదోన్నతి పై వెళుతున్న వారికి ఉత్తర్వులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మం త్రి
మాట్లాడుతూ కష్ట పడే వారికి ఫలితం ఉంటుంది అన్నారు. ఆరికరేవుల 3 లో పని
చేస్తున్న కే. వీర వెంకట లక్ష్మి, కుమార దేవం 2లో పని చేస్తున్న బి. చిన్న
ప్రభావతి, నందమూరు 2 లో పని చేస్తున్న సి. హెచ్. మాణిముత్యం, దొమ్మరు సావరం
లో కే. నాగ దేవీ, తాళ్ళపూడి మండలం కుక్కునూరు గ్రామానికి చెందిన ఆలమూరి
లక్ష్మి దుర్గ ప్రసన్న, మొత్తం 5 మందికి అంగన్వాడీ ఆయా నుండి ప్రమోషన్ పై
అంగన్వాడీ కార్యకర్తలుగా నియమించబడడం జరిగిందని మంత్రి తెలిపారు.