రాజమహేంద్రవరం : పాత్రికేయ వృత్తి ఎంతో నిబద్దత కలిగి సమాజంలో ప్రజల్లో
చైతన్యం తీసుకుని రావడంలో చురుకైన పాత్ర పోషించదగినిదిగా ఉండాలని జిల్లా
ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, సినిమాటోగ్రాఫి శాఖా మంత్రి
చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ, ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని
శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో
సి.రాఘవాచారి ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో “జర్నలిజం లో డిప్లొమా
కోర్సు” కు సంబందించి నోటిఫికేషన్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా
మంత్రి శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ విలువలతో కూడిన జర్నలిజం కోసం
పట్టణ – గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంచడం, జర్నలిజంలో
విద్యార్హత కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేయడంలో భాగంగా జర్నలిజం లో
డిప్లొమా కోర్సు ను రూపొందించి ఈరోజు నుంచి దరఖాస్తులు స్వీకరించడం
జరుగుతోందని అన్నారు. జర్నలిజం లో డిప్లొమా కోర్సు” ను ఈ సంవత్సరం (2023)
నుంచి ప్రారంభించడం జరుగుతోందని, జర్నలిజం కరెస్పాండెన్స్ విధానంలో (ఆన్ లైన్)
క్లాసులు నిర్వహణ చెయ్యడం జరుగుతుందని అన్నారు.
జర్నలిస్టులకు అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పై మంత్రి
ఆరోగ్య శ్రీ ట్రస్ట్ 8699 మంది జర్నలిస్టులు, వారి కి చెందిన ఆరోగ్యశ్రీ
హెల్త్ కార్డులు అందచేశామని మంత్రి సిహెచ్. వేణుగోపాల్ అన్నారు. తద్వారా
వారిపై ఆధారపడిన 26,700 మంది కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత ప్రయోజనం
చేకూరుస్తున్నాం అని తెలిపారు. వైద్య పరంగా జర్నలిస్టు లు, వారి కుటుంబ
సభ్యులకు 210 విభాగాల్లో వైద్య సేవలు అందించడం వలన రు. 2.70 కోట్లు మేర
చెల్లింపులు చెయ్యడం ద్వారా సుమారు 2700 మంది లబ్ది పొందినట్లు తెలిపారు.
జర్నలిస్ట్ ల కోసం ప్రత్యేకంగా కోర్ ఆపరేషన్ ద్వారా ఆరోగ్యశ్రీ పథకం అమలు
చేస్తున్నట్లు మంత్రి వివరించారు. సి రాఘవాచారి ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ
ఆధ్వర్యంలో “జర్నలిజం లో డిప్లొమా కోర్సు” కై నాగార్జున యూనివర్సిటీస్ తో
ఒప్పందం చేసుకున్నామని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని
శ్రీనివాసరావు పేర్కొన్నారు. నేటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో దరఖాస్తుల
స్వీకరణ చేస్తున్నామని ప్రకటించారు. వెబ్ సైట్ నుండి దరఖాస్తులు డౌన్ లోడ్
చేసుకోవచ్చునని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: 15.04, 2023 గా
పేర్కొన్నారు. జర్నలిజం వృత్తి చాలా ఛాలెంజ్ తో కూడిన వృత్తి అని
పేర్కొన్నారు. జర్నలిస్టులకు రూ. 1500 జర్నలిజం పట్ల అభిరుచి కలిగిన ఇతరులకు
రూ. 2000 ఫీజ్ గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రెస్ సెక్రటరీ, ప్రెస్
అకాడమీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ పేరే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే ఫీజు
చెల్లించాలని కోరారు. జర్నలిస్టులకు ఇంటర్మీడియేట్, ఇతరులకు డిగ్రీ కనీస
విద్యార్హత ఉండాలని పేర్కొన్నారు.