నరసన్నపేట : జేసీయస్ కోఆర్డినేటర్లు, గృహ సారధులు తమ అంకితభావాన్ని మరింతగా
గురుతర బాధ్యతతో నిర్వర్తించే సమయం ఆసన్నమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేట
నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల జేసీయస్ కన్వీనర్లు, గృహ సారధులతో
“జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ కార్యాలయంలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ సీఎం జగన్ దిశానిర్దేశం మేరకు ఇప్పటి వరకు ప్రజలు అందుకున్న అన్ని
సంక్షేమ పథకాలు గురించి ప్రచారం చేయాలని అన్నారు. ఈ మేరకు ఒక్కొక్కరికి
అప్పగించిన యాభై ఇళ్ళకు వెళ్ళి ఈనెల 1 నుంచి 5వ తేదీలోపు పరిచయం చేసుకోవాలని
అన్నారు. ఏడవ తేదీ నుంచి ప్రతి ఇంటికి జగన్ ఫోటోతో ఉన్న స్టిక్కర్ ను
అతికించాలని సూచించారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తేనే మీ భవిష్యత్తు
బాగుంటుందనే నమ్మకాన్ని కలిగించే విధంగా ఆయా కుటుంబాలవారికి భరోసా
ఇవ్వాలన్నారు.
ప్రతి గడపకు వెళ్లాలని, ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను
వివరించాలని సూచించారు.
గృహసారధులే ఈ కార్యక్రమానికి రథసారధులై నడిపిస్తారన్నారు. ఆ తరువాత
అనుబంధ విభాగాలు మిగిలిన పనిని పూర్తి చేస్తాయని చెప్పారు. ప్రతీ ఇంటికి
వెళ్లి ఐదుప్రశ్నలతో కూడా షీట్ ఇస్తారు. వారు నిర్భయంగా వారి అభిప్రాయాలు,
సమస్యలు తెలియజేస్తారు. సంతృప్తి వ్యక్తం చేసినవారు, అసంతృప్తి వ్యక్తం
చేసిన వారిగా విభజిస్తారు. అసంతృప్తుల సమస్యలేంటో మలివిడత టచ్
చేస్తారు. ఇందులో మిస్ట్ కాల్ క్యాంపెయిన్ కూడా ఉంది. ప్రతీ నియోజకవర్గంలో
ప్రతీ ఇంటి అభిప్రాయం ఎమ్మెల్యే వరకూ చేరుతుందన్నారు. ఇప్పటికీ సంక్షేమ
పథకాలు అందనివారు ఎవరైనా మిగిలిపోతే వారి వివరాలు నమోదుచేసుకుని పార్టీ
కార్యాలయంలో ఇవ్వాలని చెప్పారు. ఈ సమావేశంలో నరసన్నపేట, జలుమూరు, సారవకోట,
పోలాకి మండలాల పార్టీ ముఖ్య నాయకులు, జేసీయస్ కోఆర్డినేటర్లు, గృహ సారధులు
పాల్గొన్నారు.