నెల్లూరు : మహోన్నత వ్యక్తిత్వం కలిగిన శ్రీరామచంద్రుల వారి జీవితం మానవాళికి
ఆదర్శప్రాయమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖ
మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు. శ్రీరామ నవమి పండుగను
పురస్కరించుకొని నగరంలోని శబరి శ్రీరామ క్షేత్రం ఆధ్వర్యంలో కన్నులపండువగా
నిర్వహించిన జగదభిరాముడు శ్రీ సీతారామ స్వామి కళ్యాణానికి సతీ సమేతంగా హాజరై
జిల్లా కలెక్టర్ కె వి యన్ చక్రధర్ బాబు దంపతులతో కలసి స్వామి వారికి పట్టు
వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా
శబరి శ్రీరామ క్షేత్రం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు నిరాటoకంగా,
దిగ్విజయంగా జరుపటం సంతోషదాయకమన్నారు. ధర్మాన్ని కాపాడటానికి ఎన్ని
కష్టనష్టాలు ఎదురైనా ధీటుగా ఎదుర్కోవాలనే శ్రీరాముల వారి జీవితం ప్రస్తుత
సమాజానికి ఆదర్శమన్నారు. జీవితంలో ఆచరించాల్సిన, సాధించాల్సిన వాటి గురించి
స్వయంగా ఆచరించి చూపి పురుషోత్తముడిగా అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచారన్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె వి యన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ తండ్రి గా,
భర్త గా, అన్న గా కుటుంబంలోని అన్ని బంధాలకు ఆదర్శంగా నిలిచిన సకల
గుణాభిరాముడు శ్రీరాముడు ప్రతి ఒక్కరికి ఆదర్శమని, అదేవిధంగా మనిషిలోని బలాలు,
బలహీనతలు అన్నీ కలగలిపి జీవితంలోని ప్రతి పార్సాన్ని స్పృశించిన అద్భుత
మహాకావ్యం రామాయణమన్నారు. చిన్న నాటి నుండే రామాయణ ఇతిహసాన్ని గురించి
తెలియచెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.