విజయవాడ : సిగ్గుమాలిన ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తక్షణమే వారి పదవులకు
రాజీనామా చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబా యోగి
డిమాండ్ చేశారు. జగన్ 2014 ఎన్నికల నుండి 2019 వరకు ఎన్నికల వరకు ఆదివాసీలు
నీకే నమ్ముకుంటే మాకు ఇచ్చిన బహుమానం ఇదేనా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్
ఎక్కడ నీ గొంతుక మూగ పోయిందా లేకపోతే ప్రశ్నిస్తే భయమా అని వాబ అన్నారు. యోగి,
ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదివాసీ సంక్షేమ పరిషత్ విజయవాడ
ప్రెస్ క్లబ్ లో బోయ వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో కలపాలని ఏపి అసెంబ్లీ
చేసిన తీర్మానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఆదివాసీ సంక్షేమ
పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర
ఉపాధ్యక్షులు వాజయోగి మాట్లాడుతూ అభివృద్ధి చెందిన గిరిజనేతర బోయ, వాల్మీకి,
శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నకిలీ బెంతు ఒరియా కులాలను ఎస్టీ జాబితా లో కలపడం
వలన నేటికీ ఉద్యోగ ఉపాధి లేకుండా ఆదివాసి విద్యార్థులు కూలీ బాట
పడుతున్నారన్నారు. 50 లక్షల జనాభాతో కూడిన బోయ వాల్మీకి లను ఎస్టీ జాబితాలో
చేరిస్తే ఆదివాసీలు తీవ్రంగా నష్టం పోతారని ఆవేదన వ్యక్తం చేసారు. ఆదివాసీల
కోసం పొందు పరిచిన రాజ్యంగ హక్కులు ఆదివాసీ పంచకుండా అభివృద్ధి చెందిన కులాలకు
దోచి పెడితే ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి బాట పడుతున్న ఆదివాసీలు అన్యాయంకి
గురవుతారని అన్నారు. ఆదివాసీ ల కోసమే అన్ని చేస్తున్నామని చెప్పిన రాష్ట్ర
ప్రభుత్వం జీవో 3 రద్దు అయితే చట్టం చేయాలని ఎందుకు అసెంబ్లీ లో తీర్మానం చేసి
కేంద్రనికి పంపలేదని ప్రశ్నించారు. ఆదివాసీ రిజర్వేషన్ తో గెలిచిన ఎమ్మెల్యే
లు అసెంబ్లీ లో ప్రశ్నించకుండా తీర్మానాన్ని వ్యతిరేకించకుండా చప్పట్లు
కొట్టడం సిగ్గు చేటని అన్నారు. త్వరలో ఆదివాసీ ఓట్లతో గెలుపొందిన ఎమ్మెల్యేల
ఇళ్లను ముట్టడిస్తామన్నారు. రాజ్యాంగం లో ఆర్టికల్ 342 ని నిర్వీర్యం చేస్తూ
ప్రవేశ పెట్టిన తీర్మానం రద్దు చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఆదివాసీ
ప్రజా ప్రతినిధులకు ఏమాత్రం ఆదివాన్ జాతి మీద ప్రేమ ఉన్నా పార్టీలకు రాజీనామా
చేసి ఆదివాసీ ఉద్యమాల్లో పాల్గొనాలని డిమాండ్ చేసారు. రాజీనామా చేయని పక్షంలో
రాబోయే తరాలలో జాతి ద్రోహులుగా మిగిలిపోతారని, మరొకసారి ప్రజాప్రతినిధులు
ఆలోచించుకోవాలని మనవి చేశారు. ఈనెల 31న తలపెట్టిన ఆదివాసీ మన్యం బంద్ కి
పార్టీలకు అతీతంగా ఆదివాసీలు, ఉద్యోగులు. విద్యార్థులు, రాజకీయ నాయకులు
పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్
సభ్యులు జన్ని. నీలయ్య, కొత్తూరు, కిరణ్, పెద్దింటి ప్రకాష్, మధు తదితరులు
పాల్గొన్నారు.