విజయవాడ : స్థానిక 51 వ డివిజన్ లోని బుధవారం నాడు రెండు సచివాలయాలను
ప్రారంభించిన మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెళంపల్లి
శ్రీనివాసరావు ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ జగనన్న హయాంలో
నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ది పరుస్తున్నామన్నారు. గతంలో కేవలం
శిలాఫలకాలకే అభివృద్ది పరిమితమైంది నేడు శంకుస్థాపన మేమే ప్రారంభం మేమే
చేస్తున్నామన్నారు. ప్రజలకి ప్రభుత్వం సేవలు చేరువ చేసిన వ్యక్తి జగన్ మోహన్
రెడ్డి అని కొనియాడారు.అమరావతి పేరుతో విజయవాడ ప్రజలను మోసం చేసిన వ్యక్తి
చంద్రబాబు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,స్థానిక
కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్,డివిజన్ నాయకులు కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది
సచివాలయం కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.