విశాఖపట్నం : సింహాద్రి అప్పన్నను మంత్రి రోజా మంగళవారం దర్శించుకున్నారు.
అనంతరం సింహాచలం దేవస్థానం అధికారులు, పర్యాటక శాఖ అధికారులతో మంత్రి రోజా
సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింహాచలం టెంపుల్ ఇఓ, ఏపీటీడీసీ ఈడి
మళ్లీరెడ్డి, ఏపీటీడీసీ సి.ఇ, ఆలయ అధికారులు, ఏపీటీడీసీ అధికారులు
పాల్గున్నారు. ఈ సందర్బంగా మంత్రి రోజా మాట్లాడుతూ సింహాచలం వరాహ లక్ష్మీ
నరసింహ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ఎన్నో సంవత్సారాలు నుండి ఇక్కడికి
వస్తున్నాను. ఆ స్వామి వారి ఆశీస్సులు ఉంటే మనమందరం బాగుంటాము. రోజు రోజుకి
భక్తుల సంఖ్య పెరుగుతూ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి మన రాష్ట్రానికి
ప్రసాద్ పథకం ద్వారా అందించే నిధులు మంజూరు, వాటి నిర్వహణ కోసం సమీక్ష సమావేశం
నిర్వహించాం. ప్రసాద్ పథకం కింద మన రాష్ట్రం లోని సింహాచల దేవస్థానం కూడా
ఒకటి. రూ.54 కోట్ల రూపాయలతో సింహాచల ఆలయ అభివృద్ధి పనులకు రాబోయే వారం రోజుల
లోపల టెండర్లు పిలవడం జరుగుతోంది. ప్రసాదం స్కీమ్ లో ఇప్పటికే 24.13 కోట్ల తో
బుద్ధిస్ట్ సర్క్యూట్, 43.08 కోట్ల తో శ్రీశైలం దేవాలయాల అభివృద్ధి పనులను ఈ
ప్రసాద్ పథకం ద్వారా పనులను పూర్తి చేసి, ప్రారంభించడం కూడా జరిగింది. అదే
విధంగా మన సింహాచల ఆలయం పనులకు ప్రసాద్ పథకం ద్వారా మంజూరు చేశారు. పనులకు
టెండర్లను కూడా పిలవనున్నాం. మన ఆలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కోసం
కావాల్సిన పనులను ఆలయ ఈఓ అందించారు. భక్తులకు రెండు డార్మేటరీ హాల్స్, క్యు
లైన్ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, యాంపీ థియేటర్, స్టెప్స్ విస్తరణ,
స్టెప్స్ వెయ్యి వరకు నిర్మాణం, భోజన వసతి కావాల్సిన సామాగ్రి, కొండ కింద
నుండి పై వరకూ 12 వ్యూ పాయింట్ లను నిర్మాణం, గంగ ధార దగ్గర రూమ్స్ నిర్మాణం
చేపట్టనున్నామని తెలిపారు.మధురవాడ లోని శిల్పారామం ని సందర్శించిన మంత్రి రోజాశిల్పారామంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను మంత్రి రోజా
సందర్శించారు. చేతి వృత్తులను ప్రోత్సహించడానికి తయారు చేసిన వస్తువులను
మంత్రి కొనుగోలు చేశారు. శిల్పారామం లో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ పార్క్
ని మంత్రి రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శిల్పారామం సీఈవో శ్యామ్ సుందర్
, శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణి, శిల్పారామం అధికారులు పాల్గొన్నారు.