విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్ అసోసియేషన్
రాష్ట్ర కార్యవర్గం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ జేఏసీ రాష్ట్ర చైర్మన్ విఎస్
దివాకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ని ఆయన
కార్యాలయంలో మంగళవారం కలిశారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ టైపిస్ట్ కం కంప్యూటర్
ఆపరేటర్స్ రాష్ట్ర అధ్యక్షుడు జ్యోతుల సూరిబాబు, కార్యదర్శి సురేంద్ర, రాష్ట్ర
కార్యవర్గం ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. రిప్రజెంటేషన్ లో ఉన్న సమస్యలను
పరిశీలించి సానుకూలంగా స్పందించారని అన్నారు. తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి
ప్రతినెల సక్రమంగా జీతాలు అందేలా చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ
మిగిలిన సమస్యల పై కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయాలపై
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ మీరు చెప్పిన విషయాలు
సాధ్యమైనంత త్వరలో నెరవేరుస్తామని చెప్పగా కార్యవర్గ సభ్యులు ఆనందంతో
కృతజ్ఞతలు తెలిపినట్లు వివరించారు.