గుంటూరు : పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసి నిర్వాసితులుగా తాము
ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ సలహా దారులు సజ్జల
రామ కృష్ణ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చామని దాని పై ఆయన సానుకూలంగా
స్పందించారని చల్ల వారి గూడెం ఆర్ అండ్ అర్ కాలనీ కమిటీ సభ్యులు తెలిపారు.
వెస్ట్రన్ డెల్టా బోర్డ్ చైర్ పర్సన్ గంజి మాల దేవి సహకారం తో సజ్జల రామకృష్ణ
రెడ్డి నీ కలిసి నిర్వాసితులకు వ్యక్తిగత పరిహారం, ఇళ్ళ పరిహారం అందించాలని,
అలాగే గత ఏడాది వచ్చిన గోదావరి వరదల సమయంలో మునిగిన గ్రామాలు సైతం కాంటూరు
41.15 లో కలపకుండా కాంటూరు 45 లో ఉంచారని దానివల్ల నిర్వాసితులకు తీవ్ర
అన్యాయం జరుగుతుందని వారు తెలిపారు. పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాలు
కల్పించి యువతకు కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు తోడ్పాటు అందించాలనీ కోరామని
తెలిపారు. సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని
కోరగా దానికి ఆయన సానుకూలంగా స్పందించారని స్పందించారని తెలిపారు. ఈ
కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గిళ్ల.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు పెరుమాళ్
నరసింహ రావు, యూత్ అధ్యక్షుడు బద్దె.ప్రేమ్ కుమార్ , బ్రాహమ్మ్, బండి.రాంబాబు
తదితరులు ఉన్నారు.