విజయవాడ : స్వార్ధ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని వైసిపి
రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస కుమార్ ఘాటుగా విమర్శించారు. నలుగురు
వైఎస్సార్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టిడిపి ఎమ్మెల్సీ
అభ్యర్ధికి ఓటు వేయించు కోవడం చంద్ర బాబు స్వార్థ రాజకీయాలకు, తన దివాళ
కోరుతనానికి నిదర్శనమని అన్నారు. వైస్రాయ్ హోటల్ దగ్గర మొదలు పెట్టి ఈ రోజు
వరకు తను వేరే పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం చంద్రబాబుకు వెన్నతో
పెట్టిన విద్యని ఎద్దేవా చేశారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలను ,3 ముగ్గురు
ఎంపిలను ప్రలోభ పెట్టి తన వైపుకు తిప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు 4 గురు
ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడం వాళ్లకు మంత్రి పదవుల ఆశ పెట్టడం దారుణమని
విమర్శించారు. చంద్రబాబు నైతిక విలువలకు ఏనాడో తిలోదకాలు ఇచ్చారని, ఆయనకు
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదని ఆకుల శ్రీనివాస్ ఘాటుగా
విమర్శించారు. తెలంగాణాలో ఎమ్మెల్సీకి ఓటుకు నోటు ఆశచూపి అడ్డంగా దొరికిపోయి
రాత్రికి రాత్రే విజయవాడ పారిపోయి వచ్చిన విషయం ప్రజలు మర్చిపోలేదని అన్నారు.
చంద్రబాబు పరిపాలనలో కుళ్ళి పోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలని మా నాయకుడు,
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం పాటుపడుతున్నారని,
నిజాయితీ కలిగిన రాజకీయాలు చేయాలనే ఆలోచనలతో ఉన్నారని పేర్కొన్నారు. విదేశాలలో
చదువు కున్నానని చెప్పుకునే లోకేష్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నాడని,
బహిరంగ సభల్లో పెద్దా చిన్నా అని తేడా లేకుండా
నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ద్వారా లోకేష్ ప్రజలకు, యువతకు ఏమి సందేశం
ఇవ్వదలుచుకున్నారని ఆకుల సూటిగా ప్రశ్నించారు. రెండో సారి లోకేష్ ను మండలికి
పంపించాలనే ఆలోచన చంద్రబాబుకు ఉన్నా, గెలవడు అనే చివరి నిమిషంలో మహిళను పోటీలో
పెట్టాడని, తరువాత కొంత మంది నాయకులతో కలిసి ప్రలోభాలకు తెరతీశారన్నారు.
లోకేష్ పాద యాత్ర వల్ల ప్రయోజనం లేదని,రోజుకు వెయ్యి రూపాయలు ఇచ్చి మూడు మంది
జనాన్ని వెంట తిప్పు కుంటున్నారన్నారు. మొదటి నుండి కుట్ర రాజకీయాలు చంద్ర
బాబు కి వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. రానున్న 2024 ఎన్నికల్లో
ప్రజలు టిడిపిని భూస్థాపితం చేయడానికీ సిద్ధంగా ఉన్నారని ఆకుల శ్రీనివాస
కుమార్ పేర్కొన్నారు.