గుంటూరు : ఏపీ విశ్రాంత పోలీసు అధికారుల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్సులుగా
డాక్టర్ మాలకొండయ్య, కాళహస్తి సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఏపీ విశ్రాంత పోలీసు
అధికారుల సంఘం (అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ పోలీసు ఆఫీసర్స్ ) సర్వ సభ్య సమావేశం
ఆదివారం గుంటూరు లో జరిగింది. సమావేశానికి ఏపీ విశ్రాంత అధ్యక్షుడు సి ఆర్
నాయుడు అధ్యక్షత వహించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ
వార్షిక నివేదిక సమర్పించారు. సమావేశం లో పాత పాలక వర్గాన్ని రద్దు చేసి నూతన
పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికల అధికారి విశ్రాంత డిజిపి సి ఆర్ నాయుడు
ప్రకటించారు.
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గా విశ్రాంత డిజిపి డాక్టర్ ఎం
మాలకొండయ్య, కాళహస్తి సత్యనారాయణ, ఉపాధ్యక్షు లుగా ఎ రవి చంద్ర (గుంటూరు ), జి
సూర్య ప్రకాషరావు (వైజాగ్ ), ఎగ్జిక్యూటవ్ ఉపాధ్యక్షులు గా ఎం రంగా ప్రసాద
రావు (గుంటూరు ), సంయుక్త కార్యదర్సులు గా జి నారాయణ స్వామి (తిరుపతి ), సి
హెచ్ చక్రపాణి (గుంటూరు ), కార్యనిర్వాహక కార్యదర్శి ఎం రవీంద్రనాధ్ ఠాగూర్
(విజయవాడ ), కోశాధికారిగా కె వి నారాయణ (గుంటూరు ) ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు.
ఎగ్జిక్యూటివ్ సభ్యులు గా ఎ ఆర్ కె రాజు, బి వి సుబ్బారెడ్డి, కె రాజశిఖ మణి
(గుంటూరు ), కె రామకృష్ణ రావు, పి వెంకట రావు, బి డి వి సాగర్ (విశాఖపట్నం ),
డి వి ఎస్ భగవాన్ రాజు (పశ్చిమ గోదావరి ), వై శ్రీనివాస రావు, డి వి
నాగేశ్వరావు (కృష్ణా ), యల్ ప్రభాకర్ (నెల్లూరు ), నంజుడప్ప, యన్ పి దేవదానం
(తిరుపతి ), ఎస్ ఎ రజాక్ (అనంత పురం ), సి హెచ్ పాపరావు (కర్నూల్ )
ఎన్నికయ్యారు. అనంతరం నూతన పాలక వర్గాన్ని శాలువా తో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్బంగా నూతన అధ్యక్షుడు డాక్టర్ మాలకొండయ్య మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల
సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. అసోసియేషన్ నడపటం అనేది
కష్ట తరమైందన్నారు. అందరిని కలుపుకుని ముందుకు సాగుతానని ఆయన హామీ ఇచ్చారు.
ఉద్యోగం నుంచి విశ్రాంతి తీసుకున్న తరవాత పూర్తి సమయాన్ని అసోసియేషన్ కు
కేటాయించ్చినప్పుడే వారి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన అన్నారు.