విజయవాడ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 58 వ,డివిజనులో స్వయంభూ శ్రీ
దేవి కరుమారి అమ్మన్ శక్తి పీఠంలో శనివారం విజయవాడ ఎస్ బి ఏ సి పి వీర వెంకట
నాగ వర ప్రసాద్,లీలా సాయీశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత
కరుమారి అమ్మన్ శక్తి పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు, అర్చకులు
దీక్షితులు, పీఠం ట్రస్ట్ కోశాధికారి జ్ఞానేశ్వర్ లు ప్రసాద్ దంపతులకు ఆలయ
మర్యాదలతో సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. దంపతులకు శాలువా, అమ్మవారి
చీరను కానుకగా సమర్పించారు. పూజారి దీక్షితులు దంపతులు గోత్ర నామాలతో
ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ సి పి దంపతులు మాట్లాడుతూ
అమ్మవారిని దర్శించుకోవడం తాము ఎంతో అనిర్వచణియ అనుభూతిని పొందామని తమ
ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు
శక్తి పీఠం వద్ద ఏప్రిల్ 27 నుండి మే 3 తేదీవరకు జరగనున్న సహస్ర చండీ యాగం
వివరాలను ఏ సి పి దంపతులకు వివరించారు. సహస్ర చండీ యాగం ప్రాంగణంలో మట్టితో
చండీ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని కరుమారి దాసు తెలిపారు.