ఏలూరు : దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి సుమారు రూ. 200 కోట్ల విలువైన
అభివృద్ధి పనులకు ప్రారంభం, శంఖుస్థాపన కార్యక్రమాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పెదవేగి మండలంలో రూ. 68. 85 కోట్లతో
నిర్మించనున్న జగన్నాధపురం ఎత్తిపోతల పధకానికి శంఖుస్థాపన చేశారు. పెదవేగి
మండలంలో 42 గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారానికి 61. 60 కోట్ల రూపాయలతో
నిర్మించనున్న సి డబ్ల్యూ ఎస్. స్కీం కు శంఖుస్థాపన చేశారు. ముసునూరు మండలం
బలివే వద్ద 18. 33 కోట్ల రూపాయలతో నిర్మించనున్న డబుల్ లైన్ బ్రిడ్జి పనులకు
శంఖుస్థాపన చేశారు. దెందులూరు మండలం విజయరాయి గ్రామంలో రూ. 2 కోట్లతో
నిర్మించనున్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి శంఖుస్థాపన చేశారు. అదేవిధంగా
దెందులూరులో రూ. 2. 78 కోట్లతో నిర్మించిన 30 పడకల సామజిక ఆరోగ్య కేంద్రాన్ని
ప్రారంభించారు. దెందులూరు నియోజకవర్గంలో రూ. 9. 15 కోట్లతో పలు బి.టి రహదారుల
పునర్నిర్మాణానికి నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.
ఉప్పొంగిన జనాభిమానం : దెందులూరుకు భారీగా తరలివచ్చిన మహిళలు
దెందులూరులో శనివారం జరిగిన వై.ఎస్.ఆర్. ఆసరా మూడవ విడత ప్రారంభోత్సవ
కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి హెలిపాడ్ నుండి
సభావేదికకు చేరుకునే వరకు రోడ్డుకు ఇరువైపులా ప్రజలు, మహిళలు పెద్దఎత్తున
హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. వారందరికీ చిరునవ్వుతో, ముఖులిత హస్తాలతో
ముఖ్యమంత్రి అభివాదం చేశారు. సభావేదిక లో ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభించిన
వెంటనే జనాభిమానం వెల్లివిరిసింది. ప్రజలు ఒక్కసారిగా జై జై జగన్ అంటూ
హర్హధ్వానాలు చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటుచేసిన స్టాల్స్ సందర్శించిన సీఎం
సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా ఉత్పత్తుల స్టాల్ల్స్ ను
సందర్శించి, మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
తిలకించారు. ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ ఎండి. ఇంతియాజ్ ఇందుకు సంబందించిన
వివరాలను ముఖ్యమంత్రికి తెలిపారు. అనంతరం దిశా మహిళా పోలీస్ స్టేషన్ స్టాల్ ను
కూడా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లాలో దిశా యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న
వివరాలు, దిశా యాప్ కు కాల్స్ ద్వారా వచ్చిన వాటిలో పరిష్కరించిన వాటి
వివరాలను ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం
వై.ఎస్.ఆర్. ఆసరా లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి గ్రూప్ ఫోటో దిగారు.
వై.ఎస్.ఆర్. ఆసరా ద్వారా వారు చేపట్టి జీవనోపాదుల కార్యక్రమాలను గురించి
లబ్దిదారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.