ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ లేఖ
అమరావతి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.
రామకృష్ణ లేఖ రాశారు. లేఖలో ‘‘రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల పంట
నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోండి. వర్షాలు, వడగండ్లు వల్ల చాలా చోట్ల వాణిజ్య
పంటలతో పాటు ఉద్యానవన పంటలు కూడా దెబ్బతిన్నాయి. మిర్చి, అరటి, మినుము,
మామిడి, టమాట, బొప్పాయి వంటి పంటలు అధిక శాతం దెబ్బతిన్నాయి. పంట
నష్టపరిహారాన్ని తక్షణమే అంచినా వేయించండి. బాధిత రైతులకు పంట నష్టపరిహారం
సత్వరమే చెల్లించి, తిరిగి పంట పెట్టుకునేందుకు అవకాశం కల్పించండి’’ అంటూ
రామకృష్ణ లేఖలో ప్రస్తావించారు.