అమరావతి : తన రాజీనామా ఆమోదం పొందలేదని టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
తెలిపారు. రాజీనామాపై జరుగుతున్న ప్రచారం ప్రచారం మాత్రమేనని చెప్పారు.
గురువారం ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఓటు వేయడానికి శాసనసభకు
వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తన రాజీనామా ఆమోదమంటూ రాత్రి నుంచి
దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రెండేళ్ల క్రితం రాజీనామా చేసి స్పీకర్ నూ
వ్యక్తిగతంగా రెండుసార్లు కలిశానని తెలిపారు. అప్పటినుంచి ఆమోదించని రాజీనామా
గంటలో ఓటింగ్ అనగా ఆమోదిస్తారా? అని ప్రశ్నించారు. టిడిపి అభ్యర్థి పంచుమర్తి
అనురాధ గెలవబోతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఒక్కో ఎమ్మెల్సీ గెలుపొందడానికి 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. మొత్తం 175
అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీకి 151, టీడీపీకి 23, జనసేనకు ఒకరు
ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా నలుగురు సభ్యులు టీడీపీకి దూరంగా ఉంటున్నారు.
దీంతో టీడీపీ బలం 19 మంది సభ్యులుగా ఉంది. అలాగే జనసేనకు ఉన్న ఒక సభ్యుడు కూడా
ఆ పార్టీకి దూరమయ్యారు. వైఎస్సార్సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉండడంతో ఏడు
స్థానాలకు అభ్యర్థులను బరిలో దించింది. ఈ క్రమంలో ఒక స్థానం గెలవడానికి టిడిపి
అన్ని ప్రయత్నాలు చేస్తుంది.