విజయవాడ : ‘శోభకృతు’ నామ ఉగాది పండుగ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలందరికి
ఆంధ్ర ప్రదేశ్ అబ్దుల్ నజీర్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉగాది’
పండుగ తెలుగువారికి అత్యంత ముఖ్యమైన పండుగ. తెలుగు ప్రజలు ఆనందంగా,
ఉత్సాహంగా జరుపుకునే ఈ నూతన సంవత్సరం, అందరికీ కొత్త ఉత్తేజాన్ని,
ఉల్లాసాన్ని, ఉజ్వల భవిష్యత్తును తెస్తుందని ఆశిస్తున్నానన్నారు. జీవితంలోని
షడ్రుచులను కలగలిపి ఉండే ‘ఉగాది పచ్చడి’, ఏడాది పొడవునా జీవితం మనకు అందించే
అనేక అనుభవాలకు ప్రతీకగా నిలుస్తుంది.‘శోభకృతు’ నామ సంవత్సర ఉగాది పండుగ
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, సంతోషాన్ని
కలిగిస్తుందని నేను మనస్పూర్తిగా ఆశిస్తున్నానని పేర్కొన్నారు.