విజయవాడ : గుడివాడలో రైల్వే స్టేషన్ వద్దజరిగిన సంఘటనలో జరిగిన విషయాలపై
ఎంక్వయిరీ చేయకుండా ఏకపక్షంగా విఆర్ఓ అనిల్ పై కేసు పెట్టడాన్ని ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర గ్రామ రెవిన్యూ అధికారులసంఘం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై కృష్ణా
జిల్లా కలెక్టర్ , ఎస్పీ జఅధికారులతో మాట్లాడి సమన్వయం చేసుకుని ఇద్దరు
ఉద్యోగుల మధ్య ఘర్షణ జరిగినప్పుడు దానిని పరిష్కరించవలసిన బాధ్యత
ఉన్నతాధికారులపై ఉన్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులసంఘం
రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం
అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ ఘటనలో విఆర్ఓ అనిల్ భార్య అంగన్వాడి వర్కర్ అయి
ఉండడం, ఆమె భర్తను రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయమని భార్య అడిగినప్పుడు
తప్పని సరిగా అతను వాళ్ళ భార్యను రైల్వే స్టేషన్ దగ్గరికి దింపడానికి వెళ్ళడం
జరిగింది. కానీ అక్కడ ఉన్న మహిళా కానిస్టేబుల్ అంగన్వాడీ వాళ్లు ధర్నా
చేయడానికి విజయవాడ వెళ్తున్నారని ఆమెను ఆపారు. విషయం తెలుసుకున్న విఆర్వో
వెంటనే మా భార్యను ఇంటికి తీసుకెళ్ళిపోతానని, నేను కూడా విధులకు హాజరుకావాలని
మహిళా కానిస్టేబుల్ తో చెప్పిన కుదరదు. అని మహిళా కానిస్టేబుల్ అనడంతో
వాగ్వాదం జరిగింది. ఇంతలో వీఆర్వో బైక్ తీస్తుండగా మహిళా కానిస్టేబుల్ తాళం
తీయాలని ప్రయత్నించగా అతను తాళం మీద చేయి వేస్తే ఆమె అతను చేయి కొరకడం
జరిగింది. అక్కడ వీఆర్వోకు మహిళా కానిస్టేబుల్ కు వాగ్వాదం జరిగింది. వీఆర్వో
అనిల్ మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారని మహిళా కానిస్టేబుల్ విఆర్ఓ
అనిల్ పైఫిర్యాదు చేస్తే వెంటనే పోలీస్ వారు కేసు ఫైల్ చేయడం జరిగింది. కానీ
వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాగ ఒక అధికారిపై కేసు పెట్టడం చాలా దుర్మార్గమని,
అతను, అతని భార్యను తీసుకెళ్లి, పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం చాలా
దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఈ విషయమై అక్కడున్న మా డివిజన్ నాయకులతో
మాట్లాడితే మహిళా కానిస్టేబుల్ విఆర్ఓ చెయ్యి కొరికినందుకు, మహిళా
కానిస్టేబుల్ పై కూడా విఆర్ఓ ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును పట్టించుకోకుండా
కేవలం విఆర్ఓ పైనే కేసు పెట్టి కేసుకట్టడం పట్ల మేము తీవ్రంగా
ఖండిస్తున్నామన్నారు.
మహిళా కానిస్టేబుల్ పై కూడా కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపి
అక్కడున్న రెవిన్యూ, పోలీసు పెద్దలు, వారిద్దరికీ రాజీ చేసి ఉద్యోగుల పట్ల
తప్పుడు సంకేతం వెళ్లకుండా వెంటనేఈ విషయంపై చర్యలు తీసుకోవాలని, రోజు
తెల్లవారితే అటు పోలీసు వారికి వీఆర్వోలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ, కేసుల
విషయంలో మధ్య వర్తుల రిపోర్టు విషయంలో కలిసి మెలిసి ఉండవలసిన పోలీస్,
రెవిన్యూ, అధికారులు ఇలా వ్యవహరించకూడదని, మా సంఘం అభిప్రాయపడుతోందని
తెలిపారు. ఒకవేళ మీరు ఇలాగే మేము పోలీసులము కదా మా ఇష్టమని అభిప్రాయంతో ఉంటే
మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం కఠినమైన నిర్ణయాలు
తీసుకుంటామని అవసరమైతే రాష్ట్రంలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులు ఎవరూ కూడా
పోలీస్ వారికి సహకరించమని, ఏ కేసుల్లో కూడా మధ్య వర్తుల రిపోర్టులు, ఇతర
కార్యక్రమాలకు సహాయ నిరాకరణ చేస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ
అధికారులసంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు, రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి ఎం అప్పలనాయుడు స్పష్టం చేశారు.