పినిపే విశ్వరూప్మార్చి 31 లోపు మొదటి మూడు బుకింగ్ లకు ఉచిత డోర్ పికప్, డోర్ డెలివరీ సౌకర్యం
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు
విజయవాడ : షిప్ మంత్ర ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ లో
డోర్ డెలివరీ సౌకర్యం కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖా
మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు. మార్చి 31 లోపు మొదటి మూడు బుకింగ్
లకు ఉచిత డోర్ పికప్, డోర్ డెలివరీ సౌకర్యం ఉంటుందని తెలిపారు. సోమవారం
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. షిప్ మంత్ర ఆన్ లైన్ పోర్టల్
ద్వారా ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ లో బుక్ చేసిన పార్శిల్ , కొరియర్ లకు
డోర్ పికప్, డోర్ డెలివరీ సౌకర్యం లభించనుంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో సరుకు
రవాణా మొదటిసారిగా 1985 లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఏ ఎన్ ఎల్ పార్శిల్ సర్వీస్
ద్వారా ప్రారంభించారు. ఏపీఎస్ఆర్టీసీ పార్శిల్, కొరియర్ విభాగాన్ని
27.08.2017 నుండి స్వంతంగా ప్రారంభించారు.
2015 -16 లోఏ ఎన్ ఎల్ వారు 9 కోట్ల రూపాయలు సంస్థకు చెల్లిస్తే,
ప్రారంభించబడిన మొదటి సంవత్సము 2017-18 లో ఏపీఎస్ఆర్టీసీ రూ.58.57 కోట్ల ఆదాయం
సముపార్జించింది. 2017-18 లో రోజువారీ సగటు బుకింగ్లు 8,000 కాగా, 2022-23
నాటికి బుకింగ్లు 25,000 కు పెరిగాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2022-23 లో
ఇప్పటివరకు లాజిస్టిక్స్ ద్వారా రూ.163 కోట్లు సంపాదించడం జరిగింది. ఇది
సంవత్సరాంతానికి రూ.168 కోట్లు కాగలదు. డీజీటీ ల ద్వారా బల్క్ బుకింగ్స్,
బస్సుల డిక్కీ స్పేస్ బుకింగ్స్, ప్రభుత్వ సంస్థలతో సరకు రవాణా ఒప్పందాలు
కుదుర్చుకుని లాజిస్టిక్స్ ఆదాయం పెంచారు. వినియోగదారుల సౌకర్యార్ధం
01.09.2021 నుండి డోర్ డెలివరీ సదుపాయం ప్రారంభించడంతో రోజువారీ బుకింగ్ లు
25000 కి పెరిగి లాజిస్టిక్స్ ఆదాయం పెరగడానికి దోహదపడింది. వినియోగదారుల
ఆకాంక్షల మేరకు ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలను మరింత విస్తరించడంలో భాగంగా
22.03.2023 నుండి షిప్ మంత్ర ఆన్ లైన్ బుకింగ్ పోర్టల్ అనుసంధానం ద్వారా
డోర్ పికప్, డోర్ డెలివరీ సౌకర్యాన్ని ఏపీఎస్ఆర్టీసీ అందిస్తోంది.
వినియోగదారులు తమ ఇంటి వద్ద నుండే, షిప్ మంత్ర ఆన్ లైన్ బుకింగ్ పోర్టల్
ద్వారా ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్లో డోర్ పికప్ & డెలివరీ బుకింగ్
సౌకర్యాన్ని పొందవచ్చు.