నాపై జరిగిన దాడి దళిత జాతి,సమాజంపై జరిగిన దాడి
టీడీపీ సభ్యులు దాడి చేసి అవమానపరిచారు. కానీ మేము దాడి చేసి అగౌరపరిచినట్టు
వారి అనుకూలం మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. దళితులను రాజకీయంగా
ఆర్థికంగా ఎదగకుండా సమాధి చేయాలని చంద్రబాబు భావిస్తున్నాడు. ఈ దాడిపై రేపు
రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలుపుతాం.
– అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు
ఇది చంద్రబాబు చేయిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడి
“గతంలో కూడా బీసీల తోకలు కత్తిరించాలని బీసీలు జడ్జీలుగా పనికిరారని మాట్లాడిన
చంద్రబాబుకు బీసీలంటే ఎప్పుడు చులకనే” స్పీకర్ పోడియం వద్దకు వచ్చి బీసీ
సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ పై పేపర్లు చింపి విసురుతూ ఎస్సీ, ఎస్టీ
ఎమ్మెల్యేలపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేలను చట్ట సభల నుండి సస్పెండ్
చెయ్యాలి.
– మంత్రి రోజా