అసెంబ్లీలో బిల్లు ఆమోదంపై ఎమ్మెల్యేల హర్షం
12 ఏళ్ల స్వానుభవ రెవెన్యూ రికార్డులే కీలకం
క్షేత్ర స్థాయి విచారణ తర్వాత విక్రయ హక్కులు
రాష్ర్టంలో ఏన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న చుక్కల భూములకు వైఎస్సార్ సీపీ
ప్రభుత్వం పరిష్కారం చూపింది. దశాబ్దాలుగా చుక్కల భూముల పరిష్కారం కోసం ఎదురు
చూస్తున్న రైతన్నలకు సీఎం జగన్ తీపి కబురు అందించారు. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న
చుక్కల భూముల్లో సాగులో ఉన రైతులకు పూర్తిస్థాయి హక్కులు కల్పించేందుకు
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం
చేశారు. గతంలో క్రయవిక్రయాలకు వీలు లేని ఈ భూములను సదరు రైతు 12 ఏళ్ల రెవెన్యూ
రికార్డు కలిగి ఉంటే అమ్ముకునే హక్కు లభించనుంది. దీంతో పాటు 12 ఏళ్ల పాటు
ఇనాం భూముల్ని అనుభవిస్తున్న వారికి ఆయా భూములపై సర్వహక్కులు లభించనున్నాయి. ఈ
మేరకు ఉద్దేశించిన ఏపీ చుక్కల భూములు పునఃపరిష్కార సవరణ బిల్లు, ఆంధ్ర ప్రాంత
ఇనామ్ల (రద్దు, రైత్వారీలోనికి మార్పిడి) సవరణ బిల్లులకు అసెంబ్లీ
ఆమోదించింది.
తాజాగా ఆమోదించిన ఈ బిల్లుతో రాష్ర్టంలోని లక్షల మంది రైతులకు మేలు జరగనుంది.
దశాబ్ద కాలంగా కేవలం అనుభవించే హక్కులతో సేద్యం చేస్తున్న రైతున్నలకు ఈ బిల్లు
ఆమోదంతో క్రయ విక్రయాల హక్కుల లభించనున్నాయి. రెవెన్యూ శాఖలో కీలకమైన
బిల్లులను ఆమోదించి రైతులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శాశ్విత పరిష్కారం
చూపింది. ఏళ్ల తరబడి స్వాధీనంలో ఈ చుక్కల భూములను అమ్ముకోవడానికి వీల్లేకుండా
ఉన్న రైతుల భూములపై రెవెన్యూ రికార్డులు ఖచ్ఛితంగా ఉండి క్షేత్ర స్థాయిలో
విచారణ చేసి పూర్తిస్థాయి హక్కులు కల్పించే ఈ చట్టంతో పాటు క్షేత్ర స్థాయి
విచారణ తదితర అంశాలపై అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని
ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకు మించి రెవెన్యూ రికార్డులతో స్థానిక
తహసీల్దార్ కార్యాలయంలో భూమి అమ్మకానికి సంబంధించిన హక్కు పత్రాల కోసం
సంప్రదించవచ్చ. త్వరలోనే వీటి అమలుపై రాష్ర్ట ప్రభుత్వం కమిటీ వేయనుంది.
చుక్కల భూముల వాస్తవ అనుభవదారుల గుర్తింపు అనంతరం స్థానికంగా ఉన్న సచివాలయాల
ద్వారానే రిజిస్ర్టేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు
తీసుకోనుంది. మ్యుటేషన్ తదితర సేవలను కూడా స్థానిక సచివాలయాల ద్వారానే పూర్తి
చేస్తామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. రెవెన్యూ శాఖలో
తాజా బిల్లులపై శిక్షణ కోసం మూడు ప్రాంతీయ సదస్సులను నిర్వహించనున్నట్లు
అసెంబ్లీలో మంత్రి ధర్మాన ప్రకటించారు. రైతులకు వ్యవసాయంలో వైఎస్సార్ రైతు
భరోసా పథకం, ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు అందిస్తూ అండగా నిలవడంతో పాటు
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరిస్తోందని హర్షం వ్యక్తం
చేశారు. రాష్ర్టంలో భూ సురక్ష పథకం పూర్తైతే భూ వివాదాలకు ఆస్కారం లేని రైతులు
హక్కు, యాజమాన్య పత్రాలు లభిస్తాయన్నారు.