రఘూ..విగ్గూ, పెగ్గుతో ఏంటా చిందులు?
ముందు నీ మొహం అద్దంలో చూసుకో మందు తాగిన కోతీ..
నువ్వో శిఖండివి..నీతో మాట్లాటేంట్రా
నేను ఆగర్భ శ్రీమంతుడిని..నీకులా బ్యాంకు సొమ్ములు ఎగ్గొట్టలేదు
జమండ్రిలో పోటీ చేస్తావా..రా చూసుకుందాం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం
రాజమండ్రి, మార్చి 20: విగ్గు పెట్టుకుని, పెగ్గు పట్టుకుని కోతిలా చిందులు
వేస్తే వేసుకో..మీడియా ముందు నీ ఇష్టం వచ్చినట్లు వాగితే మాత్రం
బాగుండదు..నోరు అదుపులో పెట్టుకో అంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ను
ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ
మార్గాని భరత్ రామ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన మీడియాతో
మాట్లాడుతుండగా కొంతమంది విలేకరులు రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలు, వ్యంగ్య
వ్యాఖ్యాలను ఎంపీ భరత్ దృష్టికి తీసుకొచ్చారు. వాడో బఫూన్, అరిటాకు,
శుఖండి..కాకపోతే పగోడైనా నా శరీర ఛాయను మాకిష్టమైన శ్రీకృష్ణ పరమాత్మతో
పోల్చాడు..సంతోషం. కాకపోతే ఆ ఎంపీ గుణం, రంగు, ఆకారం, రూపం అచ్చం పండు కోతే.
విగ్గుది ఏముంది కానీ..ముందు నీ సైజుకు ఆపరేషన్ చేయించుకుంటే సరి అంటూ ఎద్దేవా
చేశారు. గైనకోమాస్టియా అని ఆ ఆపరేషన్ చేసుకుంటే అదేదీ అంటారు..’ఆ టైప్’
వన్నమాట నువ్వు అంటూ సెటైర్లు వేశారు. నువ్వు దేహీ అని బ్రతిమలాడితే మా
జగనన్న నీకు నరసాపురం నుండి పోటీ చేసేందుకు బిక్ష వేశారని, తీరా నెగ్గాక అటు
టీడీపీతో..ఇటు బీజేపీతో.. ఏంట్రా ఈ శిఖండి చేష్టలు అంటూ ప్రశ్నించారు. అసలు
నువ్వు మగాడివో, ఆడదానివో తెలుసుకో అంటూ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. కొంతమంది
పేటీఎం బ్యాచ్ ను రాజమండ్రిలో పెట్టుకున్నావుగా..వాళ్ళతో లేనిపోని ప్రచారం
చేయిస్తున్నావు..చేసుకో..కానీ ఒక్కటి..నోరు అదుపులో పెట్టుకో అంటూ ఎంపీ భరత్
తీవ్రంగా హెచ్చరించారు. నువ్వు రాజమండ్రిలో టీడీపీ నుంచో, జనసేన నుంచో పోటీ
చేస్తావని అంటున్నారు.. చెయ్యి..నువ్వో నేనో చూసుకుందాం..లక్ష ఓట్లకు పైగా
మెజారిటీతో గెలిచి చూపిస్తా అన్నారు. నరసాపురంలో అడుగు పెట్టే ధైర్యం లేదు
కానీ..రాజమండ్రి వస్తావా..రా..నీ సరదా తీర్చేస్తా అంటూ సవాల్ విసిరారు. ఆవ
భూముల్లో బొక్కేశానని కూతలు కూస్తున్నావట..నిరూపించు..ఒక్క రూపాయి అవినీతి
చేసినట్టు నిరూపించు అంటూ సవాల్ విసిరారు. నీకులా లేని కంపెనీల పేరు చెప్పి
బ్యాంకుల నుండి బినామీ పేర్లతో కోట్లాది రూపాయలు ఎగ్గొట్టడం చేతకాదు..నేను నా
సొంత డబ్బుతోనే రాజకీయాలు చేస్తా..పుట్టుకతోనే శ్రీమంతుడిని..నువ్వేంట్రా
కూస్తున్నావ్..నోరు అదుపులో పెట్టకో అంటూ ఎంపీ భరత్ హెచ్చరించారు. నేను రౌండ్
దీ క్లాక్ పనిచేస్తాను..ప్రజల మధ్యనే ఉంటా..నీకులా ఢిల్లీలో కూర్చుని సోది
చెప్పను..నీకులా టోపీలు పెట్టను, నీకులా తాగుబోతును కాను..ఎవరేంటో అందరికీ
తెలుసు అంటూ ఒక రేంజ్ లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పై రాజమండ్రి ఎంపీ
మార్గాని భరత్ రామ్ ఆడేసుకున్నారు.