విజయవాడ : వివిధ రంగాలలో విశిష్ట, విశేష సేవలు సేవలు అందించిన 14 మంది
ప్రముఖులకు కిన్నెర ఆర్ట్ ధియేటర్స్ నిర్వాహకులు ఉగాది పురస్కారాలు అందజేసారు.
ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పోలీసు
రంగానికి సంబంధించి ఆర్టీసీ ఎం.డి సి హెచ్ ద్వారకా తిరుమల రావు ఈ పురస్కారం
అందుకున్నారు. పోలీసు రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను ఎం.వి.నారాయణ రావు,
రిటైర్డ్ ఐ.పి.ఎస్. స్మారక పురస్కారాన్ని కిన్నెర కల్చరల్ & ఎడ్యుకేషన్
ట్రస్ట్, హైదరాబాద్ వారు రవీంద్రభారతిలో కన్నుల పండుగగా జరిగిన కార్యక్రమంలో
ఆర్టీసీ ఎం.డి సి హెచ్ ద్వారకా తిరుమల రావుకు బహూకరించారు. అతిరధ మహారధుల
నడుమ వైభవంగాజరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 14
విభాగాల ప్రముఖులు, సాహిత్యాభిలాషులు పాల్గొన్నారు. కాగా పోలీసు రంగంలో వివిధ
పదవుల్లో పనిచేసి, అటు సమాజానికీ, ఇటు ప్రజలకు న్యాయం జరిగేలా పనిచేసి, ఆయా
పదవులకే వన్నెతెచ్చిన ప్రస్తుత ఆర్టీసీ ఎం.డి సిహెచ్.ద్వారకా తిరుమల రావు
పాల్గొని శోభకృత్ నామ ఉగాది పురస్కారం అందుకున్నారు. తొలుత సి హెచ్ ద్వారకా
తిరుమల రావుని పరిచయం చేస్తూ, వివిధ పోస్టులలో వారి సేవలు, పొందిన అవార్డుల
గురించి సభకు వివరిస్తూ, పోలీసు రంగంలో ఎన్నో పదవుల్లో సమర్థవంతంగా పనిచేసిన
ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేయడం గౌరవంగా, గర్వకారణంగా భావిస్తున్నట్లు
నిర్వాహకులు తెలిపారు. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే
ఉగాది పురస్కారం పోలీసు విభాగానికి గాను సి హెచ్ ద్వారకా తిరుమల రావు,
అందుకోవడం పట్ల ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని పోలీసు అధికారులు, ఆర్టీసీ
ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.