బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు.
ఇవాళ రెండు బిల్లులకు సభ ఆమోదం తెలపనుంది. సమగ్ర భూ సర్వేపై స్వల్పకాలిక చర్చ,
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై చర్చ జరిగింది.
టీడీపీ ఎమ్మెల్యే, బుచ్చియ్యా చౌదరి మాట్లాడుతూ పారిశుద్ద్య కార్మికులకు
సకాలంలో జీతాలు రావడంలేదని, సిఆర్డీఏ కార్యాలయాలు ముట్టడిస్తేనే జీతాలు
ఇస్తున్నారని అన్నారు. వారికి ఇఎస్ఐ కార్డులు అందించాలని, వారి జీతంలో కట్
చేసిన పిఎప్ డబ్బులను ప్రభుత్వం చెల్లించాలన్నారు. ప్రభుత్వం రాజధాని విషయంలో
ఉన్న కక్ష్యను పారిశుద్ద్య కార్మికులపై చూపుతోందని, వారికి ఉద్యోగ భద్రత
కల్పించాలని డిమాండ్ చేశారు. సమాధానంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పారిశుద్ద్య కార్మికులకు రూ. 15000
ఇచ్చామని, తరువాత రూ. 21 వేలు ఇస్తున్నామన్నారు. మేము భారీగా జీతం ఇస్తుంటే
కక్ష సాధించామంటోందని, రాజధాని పారిశుద్ద్య కార్మికులకు ఇఎస్ఐ, పిఎఫ్ అనేది
కాంట్రాక్టు సంస్ధే చెల్లించాలని అన్నారు. డిసెంబర్ వరకు మాత్రమే జీతాలు
ప్రభుత్వం చెల్లించిందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.