రాష్ట్రంలో చంద్రబాబు చేతికి అందని పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమే
అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు
అమరావతి : అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు టీడీపీ,
చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బషీర్బాగ్లో రైతులను కాల్చి
చంపింది ఎవరని కన్నబాబు ప్రశ్నించారు. నిడదవోలు కాల్దరి గ్రామంలో రైలు
పట్టాలపై ధర్నా చేస్తున్న రైతులపై కాల్పులు జరిపితే ఇద్దరు రైతులు చనిపోయారని
గుర్తు చేశారు. ఏలూరు కలెక్టరేట్లో రైతులపై బాబు లాఠీచార్జ్ చేయించారని
ప్రస్తావించారు. హైదరాబాద్లో రైతులను గుర్రాలతో తొక్కించారని మండిపడ్డారు.
2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ అమలు చేసినప్పుడు లెఫ్ట్ పార్టీలు చంద్రబాబును
ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నాయి. విద్యుత్ బిల్లులు కట్టలేదని మెదక్,
మహబూబ్నగర్ జిల్లాలో రైతులకు సంకెళ్లు వేసి వ్యానులో తరలించిన చరిత్ర
చంద్రబాబుది. రైతులను రోజుల తరబడి జైళ్లలో పెట్టించాడు. పార్టీలు మారటం
గురించి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు. పార్టీ లేదు..బొక్కా లేదు అన్న
వ్యక్తి అచ్చెన్నాయుడు. చంద్రబాబు పుట్టుక కాంగ్రెస్, టీడీపీలో చేరి మామ
నుంచి పార్టీని లాక్కున్నాడు. రాష్ట్రంలో చంద్రబాబు చేతికి అందని పార్టీ
వైఎస్సార్ సీపీ మాత్రమేనని కన్నబాబు ధ్వజమెత్తారు.