వెలగపూడి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు ఆదివారం కొనసాగుతున్నాయి. వాయిదా
తీర్మానం కోరుతూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. పెరిగిన విద్యుత్ చార్జీలపై
టీడీపీ వాయిదా తీర్మానం కోరింది. అయితే సభ వాయిదాకు ముందే వాయిదా
తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ చేస్తున్న ఆందోళనల మధ్యే
సభలో డిమాండ్స్‌ను మంత్రులు ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలోనే మోటర్లకు
మీటర్లు..రైతులకు ఉరితాళ్లు అంటూ ప్లకార్డులతో టీడీపీ నిరసన చేపట్టింది. రూ.6
వేల కోట్ల కుంభకోణం మోటర్లకు మీటర్లు అంటూ టీడీపీ ఆందోళన దిగింది. స్పీకర్
పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. కాసేపు అసెంబ్లీలో గందరగోళం
నెలకొంది. దీంతో స్పీకర్ 11 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెన్షన్
చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ 11 మందిలో గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు ,
అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, నిమ్మకాయల చిన్నరాజప్ప, ఆదిరెడ్డి భవాని
తదితరులను వరసగా ఆరవ రోజు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసి బయటకు పంపించారు.