విజయవాడ : విజయవాడలో 58 వ డివిజన్ పరిధిలోని సి ఎన్ జి బంకు సమీపంలో ని శ్రీ
దేవీ కరుమారి అమ్మన్ శక్తి ఆలయంలో 72 అడుగుల ఎత్తులో మహా చండీ మట్టి
విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు
అన్నారు. శనివారం ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
ఆయన మీడియా తో మాట్లాడుతూ ఏప్రిల్ 27వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు జరగనున్న
సహస్ర చండీ యాగాయానికి శ్రీ కంచికామకోటి పీఠాదీశ్వరులు శ్రీశ్రీశ్రీ శంకర
విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్తర యాగంలో శ్రీ
దుర్గామల్లేశ్వర దేవస్థానం (విజయవాడ)స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్
శర్మ తో నిర్వహిస్తున్నామని కరుమారి దాసు తెలిపారు. యాగం ప్రాంగణంలో 72
అడుగులు ఎత్తులో మహా చండీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని 18 చేతులతో
చండీ నిలువెత్తు దర్శనం కోసం భారీ సెట్టింగు ఏర్పాటు చేస్తున్నామని ఆయన
తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి కరుమారి దాసుతో పాటుగా శక్తి పీఠం ట్రస్ట్
కోశాధికారి జ్ఞానేశ్వర్ సబ్యులు నీలకంఠరావు, శివ తదితరులు పాల్గొన్నారు.