వెలగపూడి : ఉద్దానం ప్రాంత ప్రజలకు, భావితరాలకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం
అండగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఉద్దానం ప్రజలకు
శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే తపన, చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి సీఎం జగన్
పనిచేస్తున్నారని, రూ.742 కోట్ల వ్యయంతో 100 కిలోమీటర్ల తాగునీటి పైపులైన్
నిర్మిస్తున్నామన్నారు. జూన్‌లో పైపులైన్ నిర్మాణ పనులు పూర్తవుతాయని, ఆ
ప్రాంతానికి సురక్షితమైన తాగునీరు అందుతుందని చెప్పారు. ఉద్దానం ప్రాంత
ప్రజలకు ఇబ్బందిలేకుండా రానున్న కాలంలో పలాస డయాలసిస్ యూనిట్ 200 పడకల
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని రూ.50 కోట్లతో నిర్మించనున్నామన్నారు. ఆ
ఆస్పత్రిలో 151 మంది మెడికల్ స్టాఫ్‌ను అందుబాటులో ఉంచి ఉద్దానం ప్రజలకు
మెరుగైన వైద్య సేవలు అందించబోతున్నామని చెప్పారు.