విజయవాడ : సీనియర్ వైసీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ కి శ్రీ దేవి
కరుమారి అమ్మన్ శక్తి పీఠంలో శుక్రవారం ఘన స్వాగతం లభించింది. శక్తి పీఠం
పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల 27 నుండి మే నెల
3 తేదీ వరకు సహస్ర చండీ యాగ పూర్వక మహా కుంభాభిషేక మహోత్సవాలు జరుగుతున్న
నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న ఆకుల ఆలయానికి రాగా ఆలయ ట్రస్ట్ సభ్యులు ఆయనకు
ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు.అమ్మవారి జ్ఞాపికను బహుకరించారు.
ఆకుల శ్రీనివాస్ కుమార్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు కి శాలువా కప్పి
దీవెనలు పొందారు. అనంతరం సహస్ర చండీ యాగం కరపత్రాలను ఆకుల శ్రీనివాస్ కుమార్
చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పీఠాధిపతి తో పాటుగా ఆలయ ట్రస్ట్
కోశాధికారి జ్ఞానేశ్వర్, వెంకటేశ్వరరావు,విగ్నేష్ హైట్స్ అసోసియేషన్
కార్యదర్శి ఎమ్ శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు జమ్ము శ్రీనివాసరావు,
నీలకంఠరావు, వెంకటేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.