వెలగపూడి : కేంద్ర ప్రభుత్వ నిధులను మంజూరుకు కేంద్ర క్రీడా శాఖా మంత్రి ని
కలిసి మన రాష్ట్రానికి నిధుల సమీకరించనున్నామని మంత్రి ఆర్.కే.రోజా అన్నారు.
నేషనల్ గేమ్స్ కోసం సన్నాహక ఏర్పాట్ల పై మంత్రి అధికారులతో చర్చించారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని వారిలో ఉన్న నైపుణ్యాన్ని
ప్రపంచాన్నికి తెలియచేయడం, వారి నైపుణ్యాలను పెంపొందించడానికి కావాల్సిన మౌలిక
సదుపాయాలు కల్పన కు అధిక ప్రాధాన్యత జగనన్న ప్రభుత్వం ఇస్తుందని మంత్రి
ఆర్.కే.రోజా తెలియచేసారు. సచివాలయంలోని తన చాంబర్ లో మంత్రి ఆర్.కే.రోజా
క్రీడలు, శాప్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి
గ్రామంలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్లు ఏర్పాటు వాటి నిర్వహణ పై మంత్రి
అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, టోర్నమెంట్ ల నిర్వహణ
అత్యంత శ్రద్ధతో నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా
మంత్రి ఆర్.కే.రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క
క్రీడకారుడికి ప్రోత్సాహం అందించి వారిని ఆ క్రీడలో విజేతగా నిలపడం మా జగనన్న
లక్ష్యం అని అన్నారు. ఈ సమీక్షలో శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి,
ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి మోహన్, శాప్ ఎండీ హర్ష వర్ధన్ ఇతర అధికారులు
పాల్గొన్నారు.