వెలగపూడి : సామాజిక ఆర్థిక సర్వే (సోషియో ఎకనమిక్ సర్వే) 2022-23 ను
ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. ఆర్థిక ప్రగతి జీఎస్డీపీసీ 13.17లక్షల కోట్ల
రూపాయలుగా నమోదు అయిందని, జీఎస్డీపీసీలో ఈసారి కూడా ప్రగతి సాధించామని
ప్రణాళిక విభాగం కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయకుమార్ తెలిపారు. సామాజిక ఆర్థిక
సర్వే (సోషియో ఎకనమిక్ సర్వే) 2022-23 ను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు.
ఆర్థిక ప్రగతి జీఎస్డీపీసీ 13.17లక్షల కోట్ల రూపాయలుగా నమోదు అయిందని,
జీఎస్డీపీసీలో ఈసారి కూడా ప్రగతి సాధించామని ప్రణాళిక విభాగం కార్యదర్శి
ఎస్ఆర్కేఆర్ విజయకుమార్ తెలిపారు. సర్వీస్ సెక్టార్ నుంచి 40 శాతం పైగా
భాగస్వామ్యం ఉందని, 36 శాతం వ్యవసాయ రంగం నుంచి భాగస్వామ్యం ఉందని తెలిపారు.
కోవిడ్ తరువాత సర్వీస్ సెక్టార్ లో ప్రగతి కనిపించిందని, రవాణా, రియల్
ఎస్టేట్లో గత రెండేళ్లలో గణనీయ వృద్ధి సాధించామన్నారు. రాష్ట్రం విడిపోక ముందు
తలసరి ఆదాయం ఎక్కువ ఉందని చెప్తూ విభజన తరువాత ఏపీ తలసరి ఆదాయం జాతీయ సరాసరి
కన్నా ఎక్కువగా నమోదైందని, దక్షిణాది రాష్ట్రాల కన్నా తక్కువ ఉందని చెప్పారు.
మాతాశిశు మరణాలు తగ్గాయని, 95 శాతం ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించామన్నారు.
దీన్ని నీతి అయోగ్ కూడా ప్రశంసించిందని తెలిపారు. వ్యవసాయంలో 13.18 శాతం,
పరిశ్రమల్లో 16.36శాతం, సర్వీస్ సెక్టార్ లో 18.91 శాతం వృద్ధి ఈ ఏడాది
సాధించామని విజయకుమార్ వెల్లడించారు.అప్పుల భారంపై కాగ్ ఆందోళన..
ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారుతోందని అప్పు పుడితే తప్ప.. రాష్ట్ర
ప్రభుత్వానికి రోజు గడిచే పరిస్థితి తలెత్తిందని కాగ్ ఆందోళన వ్యక్తం
చేసింది. ఆర్థిక నిర్వహణ తీరును తప్పుబడుతూ అప్పుల్లో సింహభాగం నిరుపయోగ
ఖర్చులేనని వెల్లడించింది. అన్ని భారాలూ కలిపి మొత్తం రూ.9లక్షల కోట్లకు పైనే
ఉంటాయని… ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రం సంక్షోభంలోకి చిక్కుకుంటుందని
కాగ్ తేల్చి చెప్పింది. 2021 మార్చి వరకు విశ్లేషించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక
వ్యవస్థ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అప్పుల
పరిస్థితిపై కాగ్ గిరీష్ చంద్ర ముర్ము తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్
కు అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వివిధ బ్యాంకులను కేంద్ర ఆర్థిక
శాఖ హెచ్చరించిందని తెలిపారు. రుణాలను భరించే సామర్థ్యం రాష్ట్రానికి లేదని,
రుణం తీసుకుని పాత అప్పులు తీరుస్తున్నారని కాగ్ ఆక్షేపించింది. 2020-21
ఆర్థిక సంవత్సరం చివరికి మొత్తం బకాయి జీఎస్డీపీలో 35 శాతానికి మించకూడదని
ఎఫ్ఆర్బీఎమ్ చట్టం చెబుతోందని వెల్లడించిన కాగ్.. 2021 మార్చి 31 నాటికి
అప్పులు 35.30శాతం ఉన్నాయని తేల్చి చెప్పింది.బడ్జెట్ లో చూపకుండా ఏటా అప్పులు
పెరుగుతూనే ఉన్నాయన్న కాగ్.. రెవెన్యూ వ్యయాన్ని భరించేందుకు రుణాల
మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోందని విశ్లేషించింది. రుణాల్లో 81శాతం
రెవెన్యూ ఖర్చులకే వాడుతున్నందున.. ఆస్తుల కల్పనకు ఆటంకం కలుగుతున్నట్లు
వెల్లడించింది.