నిర్వహించిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కల్యాణ్ అనేక అంశాలను
ప్రస్తావిస్తూ ప్రసంగించారు. తాను అనుకున్నట్టుగా జనసేన, బీజేపీ ఉమ్మడి
కార్యాచరణ జరిగి ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటు అనే మాట వచ్చేది కాదని స్పష్టం
చేశారు.తమకు టీడీపీ అంటే ఎక్స్ ట్రా ప్రేమేం లేదని అన్నారు. చంద్రబాబు అంటే తనకు
ఆరాధ్య భావమేమీ లేదని పేర్కొన్నారు. ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేశారు,
సమర్థుడు కాబట్టి గౌరవిస్తున్నానని, ఇప్పటి ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగ పదవిలో
ఉన్నాడు కాబట్టి, ప్రజలు ఓటేసి ఎన్నుకున్నారు కాబట్టి ఆయనకు జన్మదిన
శుభాకాంక్షలు చెబుతుంటామని వివరించారు. ఇక, పొత్తుల గురించి ప్రస్తావిస్తూ…
టీడీపీ 20 సీట్లకు జనసేనను పరిమితం చేసిందంటూ జరుగుతున్న ప్రచారంపై పవన్
స్పందించారు. చేతులెత్తి మొక్కుతున్నానని, పొత్తుల గురించి తాను ఎక్కడా
నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. వాట్సాప్ మెసేజులు చూసి మీరు నమ్మేస్తే
ఎలా అని ప్రశ్నించారు. దశాబ్ద కాలం మీకు అండగా ఉన్నాను.. కనీసం నన్ను నమ్మండి,
శంకించకండి అని విజ్ఞప్తి చేశారు.
ఈసారి ఎన్నికల్లో జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ బలిపశువు కాబోదని, ఎట్టి
పరిస్థితుల్లోనూ ప్రయోగాలు చేయబోమని చెప్పారు. ఈసారి గెలిచే విధంగానే తమ
ప్రణాళిక ఉంటుందని, తనతో సహా గెలిచి తీరాలనే బరిలో దిగుతున్నామని తెలిపారు.
నాతో నడిచేవాడే నా వాడు… నన్ను శంకించేవాడు నా వాడు కాదు అని స్పష్టం
చేశారు. ఈసారి గెలిచిన తర్వాత ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందామని కార్యకర్తల్లో
ఉత్సాహం కలిగించే వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో ఓటును వృథా
కానివ్వబోమని, జనసైనికులు వచ్చే ఎన్నికల్లో ఏంజరగాలని కోరుకుంటున్నారో అదే
జరుగుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో జనసేనది బలమైన
సంతకం ఉంటుందని పేర్కొన్నారు.